మహేష్ బాబు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ మీ మనసుకూ... నచ్చుతుంది!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో త్వరలో 'మనసుకు నచ్చింది' అనే సినిమా రాబోతోంది. సందీప్ కిషన్, అమైరా దస్తర్, త్రిధా చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ మంగళవారం సాయంత్రం మహేష్ బాబు విడుదల చేశారు.

ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన మహేష్ బాబు
‘మనసుకు నచ్చింది' మూవీ ట్రైలర్ జాయ్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. చూడటానికి చాలా బావుంది. నా సోదరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను.... అంటూ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఈ ట్రైలర్ విడుదల చేశారు.

ఆకట్టుకున్న ట్రైలర్
పెళ్లి కూతురు(హీరోయిన్) పెళ్లి కొడుకు(హీరో)ను పెళ్లి పీటల మీద నుండి లేపుకుపోయే సీన్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇలాంటి కాన్సెప్టుతో తెలుగులో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ట్రైలర్ చూస్తుంటే మంజుల కథను చాలా కొత్తగా రాసుకున్నట్లు స్పష్టమవుతోంది.

కసిగా చేసిన మంజుల
'ఫాలో యువర్ హార్ట్' అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉంది. మంజుల ఎప్పటి నుండి తనను తాను నిరూపించుకోవాలని ఆశ పడుతోంది. ఈ సినిమా ద్వారా ఆమె లక్ష్యం నెరవేరడం ఖాయం అనిపిస్తోంది.
మంజుల భర్త నిర్మాత
ఈ సినిమాను సొంత బేనర్లో రూపొందిస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ బేనర్లపై మంజుల భర్త సంజయ్ స్వరూప్, జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











