ప్రతి మహిళను బలాత్కరించి, హత్య చేసే కథతో...
ఒక యువకుడు చిన్నతనంలో తన తల్లి చేసిన ద్రోహం చూసి తట్టుకోలేక తల్లిని, తండ్రిని హతమార్చడంతో పాటు యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత పరిచయమైన ప్రతి మహిళను బలాత్కరించి, హత్య చేస్తుంటాడు. చివరికి ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది అంటున్నారు 'మానవ మృగం' నిర్మాతలు. ప్రతిభా ఫిలిమ్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్న 'మానవ మృగం' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్ దశలో ఉంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం చేసారు. ఈ చిత్రంలో ఆర్యన్, సన, అలియా ఈ చిత్ర ముఖ్య తారాగణం. చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ' క్వాలిటీ కోసం ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించాం. ఇందులో హీరో గెటప్ విచిత్రంగా ఉంటుంది. దాని రూపకల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పౌల్, ఫొటోగ్రఫీ: ప్రమోద్, కొరియోగ్రఫీ: దిలీప్, నిర్మాత: వెంకట్, దర్శకత్వం: రవి.


Click it and Unblock the Notifications











