‘మంచివాడు’ తనీష్
ఆణిముత్యాల్లాంటి అందరూ మెచ్చి అభినందించిన పలు ఉత్తమ కథా చిత్రాల్ని అందించిన మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సంస్థలో సునీల్ కథానాయకుడుగా 'అందాలరాముడు" వంటి హిట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు లక్ష్మీనారాయణ(దీప్తి)కి మరో అవకాశాన్ని యిస్తూ యువ కథానాయకుడు తనీష్ హీరోగా అందరూ మెచ్చే కథతో 'మంచివాడు" చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 31 నుంచి చిలుకూరు సమీపంలోని ఒ గహంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ 'ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం 'నచ్చావులే" ద్వారా కథానాయకుడుగా అందరికీ పరిచయమైన తనీష్ హీరోగా 'మంచివాడు" చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో తనీష్ ఉత్తమ గుణాలు కలిగిన మంచి కుర్రాడుగా నటిస్తున్నాడు. అతని సరసన 'భామ"ని ఎన్నిక చేశాము అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రపాద్ 'మంచివాడు" గురించి చెబుతూ 'మా సూపర్ గుడ్ సంస్థలో హిట్ చిత్రాన్ని చేసిన దీప్తికి మళ్ళీ అవకాశాన్ని ఇస్తూ 'మంచివాడు" నిర్మిస్తున్నాము అన్నారు. అలాగే ఈ సినిమాను ఇంటిల్లిపాది మెచ్చే ఓ మంచి కథతో 'మంచివాడు" ని ప్లాన్ చేశాము. ఆగస్ట్ 31 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాము. సెప్టెంబర్ 20వరకు సింగల్ షెడ్యూల్ లో సినిమాని పూర్తి చేస్తాము అన్నారు. తనష్ నటిస్తున్న ఈ చిత్రంలో భామ కథానాయకి, కళాతపస్వి, కె.విశ్వనాథ్ కథలోని ఓ కీలకమైన పాత్రని పోషిస్తుండగా చంద్రమోహన్, వేణుమాధవ్, రఘుబాబు, కోవైసరళ, సుధ, క్రాంతి, దేవిశ్రీ మరియు సంగీత దర్శకుడు కోటి తనయుడు అయిన రాజీవ్ మరో ప్రధాన పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాకి శిప్పి సంగీతాన్ని సమకూర్చనున్నారు.


Click it and Unblock the Notifications











