twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పనీపాటాలేనోడి ప్రేమకధ (మంచివాడు ప్రివ్యూ)

    By Srikanya
    |

    సునీల్ తో అందాల రాముడు చిత్రం రూపొందించి హిట్ కొట్టిన దీప్తి రెండో ప్రయత్నం మంచి వాడు చిత్రం. ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతోంది. చిత్రం కథ ప్రకారం. రిటైర్డ్‌ కలెక్టర్‌ దశరధరామయ్య (కె.విశ్వనాథ్‌) మనవడు రాజా (తనీష్‌).రాజా పుట్టకముందే తండ్రిని,పుట్టగానే తల్లిని పోగొట్టుకుంటాడు.దాంతో అతన్ని అతని తాత ఓ లూజర్ గా భావించి,అలాగే ట్రీట్ చేస్తూంటాడు.అతను తప్ప ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవాళ్ళే.అతనికే అక్షరం ముక్క కూడా అబ్బలదు. ఊళ్లో పనీ పాటా లేకుండా తిరుగుతాడు. ఐడియాల అంజి (రఘుబాబు) ఇచ్చే చెత్త సలహాలు పాటించడమే పనిగా పెట్టుకొంటాడు.ఈ లోగా రాజా మరదలు ఇందు (భామ) అమెరికాలో చదువు పూర్తిచేసుకొని తిరిగొస్తుంది.అది అతని జీవితంలో పెద్ద మార్పునే తీసుకువస్తుంది.ఇందుని ప్రేమలో దించడానికి రాజా రకరకాల ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.ఓ ఉద్యోగంలో చేరుతాడు. మొదటి జీతం అందుకుని ఆమెకో ఖరీదైన గిప్ట్ కొంటాడు.మరి ఇందు ప్రేమ గెలుచుకొన్నాడా? లేదా? అనే విషయాలు తెర మీదే చూడాలి. ఇక ఈ చిత్రం గురించి సమర్పకుడు ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ ...కుటుంబ బంధాలకు పెద్ద పీట వేసిన చిత్రమిది. ఆవారాగా తిరిగే కథానాయకుడు మంచివాడుగా ఎలా పేరు తెచ్చుకొన్నాడో చూపించాం. శిర్పి పాటలు ఆకట్టుకొంటాయన్నారు.

    సంస్థ: మెగా సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌
    నటీనటులు: తనీష్‌, భామ, కె.విశ్వనాథ్‌, రఘుబాబు, సోనియా, చలపతిరావు, చంద్రమోహన్‌, జయంతి, ప్రసాద్‌బాబు, వైజాగ్‌ప్రసాద్‌, చిట్టిబాబు తదితరులు
    సమర్పణ: ఆర్‌.బి.చౌదరి
    నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌
    దర్శకత్వం: వి.లక్ష్మీనారాయణ (దీప్తి)

    English summary
    Lakshmi Narayana (who shot to fame with his debut film, Super Good's Andhala Ramudu) says the grandfather particularly dislikes the protagonist who otherwise is 'Manchivadu.' "It is a beautiful love story set in the rural backdrop with loads of entertainment and a dash of sentiment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X