కవల పిల్లలకు తండ్రి అయిన మంచు విష్ణు...!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అభిమానులకు శుభవార్త. మోహన్ బాబు కవల పాపాయిలకు తాతయ్య కాబోతున్నారు. స్కానింగ్ ప్రకారం నిర్ణయించిన తేదీ డిసెంబర్ 2వ తేదీ కాగా, కొంచెం కుడిఎడమగా ఆయన తాతయ్య అయ్యే అవకాశం ఉంది. వెరోనికా ను పెళ్లాడిన హీరో మంచు విష్ణు కవల పిల్లలకు తండ్రి కాబోతున్నారు.
హీరో విష్ణు-వెరోనికా దంపతులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ప్రసవం కూడా అమెరికాలోనే జరగుతుంది. దాంతో విష్ణుకు జన్మించబోయే ఇద్దరు పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. విష్ణు తండ్రి కాబోతున్న సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అటు మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి, ఇటు వెరోనికా కుటుంబం నుంచి పలువురు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి దాదాపు 125మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. వారందరూ బస చేయడం కోసం అమెరికాలో నెల రోజుల ముందునుంచే 15ఇళ్లను అద్దెకు తీసుకున్నారు.
నామకరణం కూడా సిద్ధం చేసుకున్నారు. వారికోసం ఆటబొమ్మలు తదితర సామాగ్రి అంతా సుమారు నలభై లక్షల రూపాయల వ్యయంతో ఇప్పటికే కొని సిద్ధంగా ఉంచినట్లు కూడా తెలిసింది. కవల పిల్లలు కొత్త ప్రపంచంలోకి రాబోతున్న సందర్భానికి మంచు విష్ణు వెరోనికాల కుటుంబాలు రెండూ ఆనందోత్సాహాల్లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











