మా నాన్న చేసింది ఒకే ఒక తప్పు.. అదొకటే.. : మోహన్ బాబుపై విష్ణు షాకింగ్ కామెంట్స్

Manchu family controversy: మంచు కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారంటూ విభిన్న కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో మంచు మనోజ్, మోహన్ బాబు, విష్ణు లు పరస్పర ఆరోపణలు చేసుకుంటారు. మరోవైపు.. మనోజ్ పై.. ఇటు మోహన్ బాబుపై కేసు నమోదు అయినట్లు సమాచారం. అలాగే.. విచారణకు హాజరుకావాలని మంచు విష్ణును లీగల్ నోటీసులు జారీ చేయడం.. అంతా షాకింగ్ గా ఉంది. ఆస్తి కోసమే వీరి మధ్య తగాదాలు వస్తున్నాయని పలువురి వాదన. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేశారు.

మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. 'ఇలా మాట్లాడాల్సి వస్తది. ఇలాంటి సిచువేషన్ నా ఫ్యామిలీకి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.ప్రతి ఇళ్లో సమస్యలుంటాయి. ఆ సమస్యలు ఎలాగోలా పరిష్కారం జరుగుతుంది పెద్దలు అందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు. ఎవరో ఒకరు పరిస్థితులకు అనుగుణంగా నడుకుంటారని వేచిచూస్తా.. ఈ విషయాలపై నేను ఎక్కువగా మాట్లాడను. ఎక్కువ మాట్లాడితే ఏడుపు వచ్చేలాగా ఉంది. ఈ విషయం అందరికీ బాధాకరమైనది.' అని ఎమోషనల్ అయ్యారు విష్ణు.

Manchu Family Controversy Manchu Vishnu Sensational Comments on Mohan Babu in press meet

'మా నాన్నగారు ఏదైనా తప్పు ఉంటే.. ఆయన చేసింది ఒకే ఒక తప్పు.. అది మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వారికి మా ఫ్యామిలీ గురించి తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే.. అది మమ్మల్ని ప్రేమించడమే. ఈరోజు మీడియా మిత్రులందరికీ ప్రార్థించి చెప్పేది ఒక్కటే. మీకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి. అందులో కూడా సమస్యలు ఉంటాయి. మాది ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి మెలిసి ఉంటామని భావించాం .. కానీ, దురదృష్ట శాత్తు ఇలా కలహాలు చోటుచేసుకున్నాయి. కానీ, మా ఇంటి విషయాలను దయచేసి సెన్సేషనల్ చెయ్యొద్దు ఇది నా విజ్ఞప్తి.' అని రిక్వెస్ట్ చేశారు.

'మీడియాలో కొంతమంది వారి లిమిట్స్ ని క్రాస్ చేస్తూ.. మా ఫ్యామిలీ విషయాలను బయటపెడుతున్నారు. దీంతో మా అమ్మ మంచాన పడింది. నిన్న జరిగిన ఘర్షణలో మా నాన్న గాయపడ్డారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కన్నప్ప షూటింగ్ ప్రొడక్షన్ వర్క్స్ లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నాయి. ఈ విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి వచ్చాను. నాకు ఫ్యామిలీని ముఖ్యం. కెరీర్ తర్వాత. నిన్న ఉదయమే నేను ఇండియాకు వచ్చాను. నేను లేని ఈ మూడు రోజుల్లో ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ ఈ వివాదం ఎక్కడన్నా ఒక దగ్గర ముగుస్తుందని భావిస్తున్నా.. దయచేసి మా ఇంటి విషయాలను టిఆర్పి కోసం అతిగా చేయొద్దు' అంటూ విష్ణు రిక్వెస్ట్ చేశారు.

Manchu Family Controversy Manchu Vishnu Sensational Comments on Mohan Babu in press meet

'అలాగే నిన్న జరిగిన గొడవలో ఓ మీడియా మిత్రునికి గాయాలయ్యాయి. ఆ ఘటన చాలా దురదృష్టకరం. దానికి నేను చింతిస్తున్నాను. నిన్నటి విజువల్స్ చూస్తే.. మీకే అర్థమవుతుంది. నాన్నగారు మీడియా మిత్రులకు దండం పెడుతూ..ముందుకు వచ్చారు. ఈలోగా ఆయన ముఖంపై మైకు పెట్టేసరికి.. కోపం తట్టుకోలేక అలా చేసి ఉంటారు .అలా జరిగి ఉండకూడదు. ఉద్దేశపూర్వకంగా అతన్ని కొట్టాలని ఆయనకు లేదు. గాయపడిన మీడియా మిత్రులతో నేను టచ్ లో ఉన్నాను. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాను. ఈ విషయంపై అందరం చింతిస్తున్నాం.' అని విష్ణు పేర్కొన్నారు.

'మీడియా మిత్రులతో, యాజమాన్యంతో నాన్న గారు ఎలా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే మాకు నోటీసులు రాకముందే పోలీసులు మీడియాకు సమాచారాన్ని విడుదల చేస్తున్నారని, అది ఎలా సాధ్యమవుతుందని అన్నారు. ఈరోజు ఉదయం నాన్నగారి గన్ సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు. ఆ విషయాన్ని నిన్ననే మీడియాలో ప్రసారమైంది. ఇవాళ 9 గంటల 30 నిమిషాలకు నోటీసులు ఇచ్చి 10 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? అంటూ మంచు విష్ణు ప్రశ్నించారు. ఈ ఘటనలో తాను లేనని నిన్న ఉదయం వచ్చాననే విషయం అందరికీ తెలుసు. అయినా.. నన్ను ఎందుకు పిలిచారు అర్థం కావడం లేదు. కానీ పోలీసు వారిపై రెస్పెక్ట్ తో హాజరవుతారు'అని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X