మేము సైతం: మంచు ఫ్యామిలీ కబడ్డీ గేమ్, లక్ష్మి కూడా...

By Bojja Kumar

హైదరాబాద్: విశాఖ హుధూద్ బాధితుల సహాయార్థం నిధుల సేకరణలో భాగంగా టాలీవుడ్ పరిశ్రమ ఈ నెల 30న ‘మేము సైతం' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీ తమ ప్రత్యేకతను చాటుకోబోతోంది. మంచు ఫ్యామిలీ స్టార్స్ అంతా కబడ్డీ మ్యాచ్ ఆడబోతున్నారు.

మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌తో పాటు మంచు లక్ష్మి కూడా వివిధ జట్లుగా విడిపోయి ఆడబోతున్నారు. వీరి టీంలలో ఇతర హీరోలు, హీరోయిన్లు, నటులు ఉంటారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, జూ ఎన్టీఆర్ లాంటి వారు తమ తమ కార్యక్రమాలతో ప్రత్యేకత చాటబోతున్నారు.

మేము సైతం...ప్రొగ్రామ్ చూసేందుకు ఒక్కో టికెట్ ఖరీదు రూ. 15000. బుక్ మై షో ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఈ టికెట్స్ కొన్నవారంతా థంబోలా గేమ్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు. థంబోలా గేమ్ విజేతకు మెర్జిడెజ్ బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

Manchu family 'Kabadi Match'

రోజంతా వినోద కార్యక్రమాలు.... త్రివిక్రమ్ సమక్షంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలిసి ఓ స్కిట్ చేయబోతున్నారనే విషయం తెలిసిందే. ఇందులో త్రివిక్రమ్ వారిద్దరికి ప్రశ్నలు వేస్తే...వారు ఆసక్తికరంగా సమాధానాలు ఇవ్వనున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ కార్యక్రమం జరుగనుంది. అదే విధంగా దర్శకుడు బోయపాటి శ్రీను సమక్షంలో నందమూరి హీరోలు బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ కలిసి కూడా ఓ షో చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో 12 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ స్టార్స్ అంత్యాక్షరి, డాన్స్ ఫ్రోగ్రామ్స్ ఇలా చాలా కార్యక్రమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

తెలుగు పరిశ్రమ లోని యంగ్ హీరోస్ అంతా 4 టీమ్స్ గా విడిపోయి ఈ మ్యాచ్ ఆడనున్నారు. ప్రతి టీంలోనూ 6 మంది ప్లేయర్స్ ఉంటారు, అందులో 4 హీరోస్ ఉంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అలాగే ప్రతి మ్యాచ్ కి 6 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఈ క్రికెట్ మ్యాచ్ మొత్తానికి హెడ్ గా వెంకటేష్ వ్యవహరించనున్నాడు. టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన వారు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. తెలుగు పరిశ్రమ ప్రముఖులతో తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు. నవంబర్ 30న టాలీవుడ్ కి సెలవు ప్రకటించారు. పవన్, మహేష్, బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి స్టార్స్ ఉండటంతో ఈ పోగ్రాం ట్రాన్సిమిషన్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ గా జెమినీ టీవి వారు ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X