త్వరలో...మోహన్ బాబు కార్పోరేషన్
అమితాబ్ బచ్చన్ ఎబి కార్పోరేషన్ తరహాలో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ఎమ్ బి కార్పోరేషన్ పెట్టనున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు వర్ధన్ తన ట్విట్టర్ లో ది ఎక్సైటింగ్ న్యూస్ అంటూ ఈ విషయాన్ని పేర్కొన్నారు. అతి త్వరలోనే ఓ పెద్ద కార్పోరేట్ ఆఫీసుకు తాము మారుతున్నామని, ప్లేస్ ఫైనలైజ్ అయిందని ట్వీట్ చేసారు. ఇక మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు పూర్తి భాద్యత వహిస్తారు. ఆమె నిర్మాతగా తన తమ్ముడు మనోజ్ హీరోగా మోహన్ బాబు సమర్పణలో ఝుమ్మంది నాదం చిత్రం చేస్తున్నారు. సలీం ప్లాప్ అనంతరం ఏ చిత్రమూ కమిట్ కాని విష్ణు ప్రస్తుతం బిజెనెస్ వ్యవహారాల్లో తమ సంస్ధ నిర్మిస్తున్న సీరియల్స్ పనుల్లో బిజీగా ఉన్నారు.
మోహన్ బాబు అమితాబ్ బచ్చన్ లక్ష్మీ ప్రసన్న సలీం వైవియస్ చౌదరి ఇలియానా mohan babu amithab bachchan laxmi prasanna saleem yvs chowdary ileana


Click it and Unblock the Notifications