»   »  మంచు ఫ్యామిలీ...‘పాండవులు పాండవులు తుమ్మెద’

మంచు ఫ్యామిలీ...‘పాండవులు పాండవులు తుమ్మెద’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు ఫ్యామిలీ హీరోలైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లతో పాటు వరుణ్ సందేశ్, తనీష్‌లతో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ సంస్థపై మంచు విష్ణు, మనోజ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు, మనోజ్ సరసన హన్సిక, ప్రణీత హీరోయిన్స్.

తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....ఈ చిత్రానికి 'పాండవులు పాండవులు తుమ్మెద' అనే టైటిల్ పరిశీలిస్తున్న స్పష్టం అవుతోంది. ఇటీవల ఇలాంటి వెరైటీ టైటిళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండుగా మారిపోయాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది', 'రామయ్యా వస్తావయ్యా' లాంటి టైటిళ్లు ఫ్యామిలీ ఎంటర్టెనర్లకు సింబాలిక్‌గా మారాయి.

Manchu Family Movie Titled 'Pandavulu Pandavulu Tummeda'

ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీకి....'పాండవులు పాండవులు తుమ్మెద' అనే టైటిల్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. సినిమాలో ఐదుగురు హీరోలు ఉండటం వల్ల ఈ టైటిల్ బాగా సూటవుతుందని భావిస్తున్నారు. 1970లో ఏఎన్ఆర్ హీరోగా వచ్చిన 'అక్కా చెల్లెళ్లు' చిత్రంలో 'పాండవులు పాండవులు తుమ్మెద' పేరుతో ఓ పాట కూడా ఉండటం విశేషం.

ఎన్నో ప్రత్యేకతలతో, ఇంతవరకూ తెలుగులో రానివిధంగా ఈ చిత్రం నిర్మాణం కాబోతోంది. ఇది ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. రచన: గోపీ మోహన్‌, కోన వెంకట్‌, బీవీయస్‌ రవి, ఛాయాగ్రహణం: పళనికుమార్‌, సమర్పణ: అరియానా, వివియానా.

English summary
Film Nagar news is that whole Manchu family multi starrer movie title confirmed by movie unit, it is ‘Pandavulu Pandavulu Tummeda’ since it have five lead hero’s Mohan babu, Vishnu, Manoj, Varun Sandesh & Tanish they gone for this title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu