వైయస్ జగన్ అరెస్ట్ పై మంచు హీరోలు ట్వీట్స్

By Srikanya

వైయస్ జగన్ అరెస్ట్ రాష్ట్రమంతటా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. చంచల్ గూడా జైలులో ఉన్న జగన్ గురించి జనం, సెలబ్రేటీలు రకరకాలుగా వ్యాఖ్యానించారు. కొందరు సపోర్టు చేస్తే.. మరికొందరు జగన్ దే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. దానిని కొందరు ట్విట్టర్ రూపంలో తెలిపారు. అయితే తెలుగు హీరోల్లో రామ్ చరణ్, మంచు విష్ణు, మంచు మనోజ్ తప్ప మరెవ్వరూ ఈ విషయమై ట్విట్టర్ లో స్పందించలేదు.

మంచు మనోజ్ ట్విట్టర్ లో... న్యాయం అనేది అందరు రాజకీయ నాయకులుకీ సమానంగా ఉండాలి. ఇన్ సెక్యూరిటీస్ పేరుతో ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం చాలా తప్పు అని ట్వీట్ చేసారు.

ఇక మంచు విష్ణు ట్వీట్ చేస్తూ... వైయస్ కుటుంబానికి స్ట్రెంత్ ఇవ్వమని ప్రార్ధిస్తున్నాను అని ట్వీట్ చేసారు.

ప్రస్తుతం మంచు విష్ణువర్థన్‌ బాబు, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఓ చిత్రం నిర్మిస్తోంది. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ విష్ణువర్థన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఆద్యంతం వినోదభరితంగా ఈ చిత్రం రూపొందుతుందని, 'ఢీ' తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన కెరీర్‌లో నిలుస్తుందని విష్ణు తెలిపారు. ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X