Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
28న మంచు కురిసే వేళలో.. బిగ్ హిట్ ఖాయమని నిర్మాత ధీమా
రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం మంచు కురిసే వేళలో. ఇటీవలే రిలీజైన మోషన్ పోస్టర్, టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. పాటలకు చక్కని స్పందన వస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బృందం క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ఈనెల 28న సినిమా థియేటర్లలో రిలీజవుతోంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ..మంచు కురిసే వేళలో అందమైన లొకేషన్స్ లొ అంతే అందమైన కథ కథనాలతొ తీసిన స్వచ్చమైన ప్రేమకథా చిత్రం. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్లో ఇదొక ఉత్తమ చిత్రమవుతుంది. కథానాయిక నటన, అందచందాలు ఆకట్టుకుంటాయి. అన్ని పనులు పూర్తయ్యాయి అని అన్నారు.
ఇటీవలే రిలీజైన ఆడియోకి శ్రోతల నుంచి స్పందన బావుంది. తాజాగా సెన్సార్ క్లీన్ యు ఇచ్చి అభినందించడం కాన్ఫిడెన్స్‌ను పెంచింది. ఈ సీజన్లో బెస్ట్ ఎంటర్టైనర్ని అందిస్తున్నాం. కుటుంబ సమేతంగా అందరినీ ఆకట్టుకునే చిత్రమిది. పెద్ద విజయం అందుకుంటామన్న ధీమా ఉంది అని బాల పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, పి.ఆర్.ఓ : సాయి సతీష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి.