మీ పిల్లలకు అలా చేయడం వచ్చా?.. కూతురితో మంచు లక్ష్మీ పాఠాలు
ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ కూడా యూట్యూబ్ చానెల్స్ పెట్టుకుంటున్నారు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను, క్రియేటివిటీని అక్కడే చూపించుకుంటున్నారు. అలా మంచు లక్ష్మీ కూడా ఓ యూట్యూబ్ చానెల్‌ను పెట్టుకున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కాలంలో మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి కొన్ని వీడియోలు చేసింది. అవి బాగానే క్లిక్ అయ్యాయి కూడా. యూట్యూబ్ చానెల్ ప్రారంభ సమయంలో మోహన్ బాబు తన ఆశీర్వాదాన్ని అందించాడు.

ఆ విషయాలపై అవగాహన..
పిల్లలను ఎలా పెంచాలి.. మోడ్రన్ ప్రపంచంలో పిల్లలకు మంచి చెడులు ఎలా నేర్పించాలనే విషయాలపై మంచు లక్ష్మీ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన కూతురు నిర్వాణతో కలిసి మంచు లక్ష్మీ కొన్ని పాఠాలను తన ఫాలోవర్లకు చెబుతూ ఉంటుంది. నిర్వాణ ఆ మధ్య పాడిన భక్తి పాట బాగానే క్లిక్ అయింది.

యూట్యూబ్‌లో వైరల్..
ప్రస్తుతం సెలెబ్రిటీలు యూట్యూబ్‌ను ఓ సాధనంగా వాడుకుంటున్నారు. యూట్యూబ్‌లో ఎక్కువ మందిని ఆకట్టుకునేందుకు రకరకాల వీడియోలను షేర్ చేస్తున్నారు. కానీ మంచు లక్ష్మీ మాత్రం తన కూతురితో కలిసి చిన్న పిల్లలకు అవసరమైన పద్యాలు, నీతి సూత్రాలను చెప్పుకుంటూ వస్తోంది.
మిల్కీ బ్యూటీ గ్లామరస్ ఫోటోషూట్... మీరెప్పుడూ చూడని తమన్నా ఫోటోలు

తాజాగా అలా..
అయితే తాజాగా పిల్లలకు కలిగే బాధ, సంతోషం వంటి ఎమోషన్స్ గురించి ఓ పాఠం చెప్పేందుకు మంచు లక్ష్మీ రెడీ అయింది. ఏ ఏ ఫీలింగ్ ఎలా ఉంటుంది.. ఎందుకు కలుగుతుంది అనే చెప్పేందుకు మంచు లక్ష్మీ తన కూతురితో ఓ వీడియోను చేస్తుందట. అవతలి వాళ్లు ఏ ఎమోషన్‌లో ఉన్నారు.. తెలుసుకుని వాటికి సరైన రియాక్షన్ ఎలా ఇవ్వాలో మనం చెప్పాల్సి ఉంటుందని మంచు లక్ష్మీ పేర్కొంది.

అవన్నీ తెలుసా?
ఎమోషన్స్‌ను వ్యక్త పర్చడం, వాటిని చూపించడం మీ పిల్లలకు తెలుసా? ఈ వాలెంటైన్స్ వారంలో మీకు ఆ విషయాలన్నీ నా కూతురు నిర్వాణతో కలిసి చెబుతాను. మన జీవితంలో సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ ఎలా అవసరం ఎందుకు అవసరమో చెబుతానంటూ మంచు లక్ష్మీ పేర్కొంది.


Click it and Unblock the Notifications











