అప్పు తీరలేదు , వాళ్లు మోసం చేశారు, నా జోలికొస్తే తన్నడానికి ముగ్గురు... : మంచు లక్ష్మి

By Bojja Kumar

'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన మంచు లక్ష్మి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమా అనేది తనను ఎప్పుడూ మోసం చేయలేదని, మనుషులే మోసం చేశారని తెలిపారు. సినిమాలు నిర్మించడానికి కొన్ని అప్పలు చేశాను. గుండెల్లో గోదారి సినిమా సమయంలో చేసిన అప్పులు ఇంకా తీరలేదు. వైఫ్ ఆఫ్ రామ్ మూవీ హిట్టయి తన అప్పులన్నీ తీరేంత డబ్బులు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. దీంతో చాలా విషయాలపై మంచు లక్ష్మి మాట్లాడారు.

ఆ షో చేయడం నాన్నకు ఇష్టం లేదు

ఆ షో చేయడం నాన్నకు ఇష్టం లేదు

‘మేము సైతం' అనే షో వల్ల చాలా మందికి హెల్ప్ అయింది. కానీ ఈ షో చేయడం నాన్నకు ఇష్టం లేదు. ఆ షో వల్ల నేను చాలా కష్టపడుతున్నాను. ఎంతో బాధను నాలో నింపుకుంటున్నాను అనేది ఆయన వాదన. పది మంది వచ్చే రోడ్డు మీద నిలబడి సహాయం అడిగి నువ్వు హెల్ప్ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ ఇంతలా కష్టపడటం అవసరమా అని ఆయన అంటుంటారు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

 ఆ అప్పులు ఇంకా ఉన్నాయి

ఆ అప్పులు ఇంకా ఉన్నాయి

‘గుండెల్లో గోదారి' సినిమా వల్ల ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చిన మాట నిజమే. ఆ అప్పులు ఇప్పటికీ కడుతూనే ఉన్నాను. నేను చేస్తున్న సినిమాలకు డబ్బులు రాక పోవడం వల్ల చేసే పనిని ఎంజాయ్ చేయలేక పోతున్నాను.

మనశ్శాంతిగా పడుకుని సంవత్సరాలైంది

మనశ్శాంతిగా పడుకుని సంవత్సరాలైంది

తీసుకున్న డబ్బులు వెంటనే ఇచ్చేయ్ అని నాపై ఒత్తిడి అయితే లేదు. కానీ నేను తీసుకున్న ప్రతి రూపాయి తిరిగి వెనక్కి ఇచ్చేయాలనేది నా ప్రిన్సిపుల్. లేకుంటే నాకు నిద్ర పట్టదు. ఆ బర్డెన్ వల్ల మనశ్శాంతిగా పడుకుని కొన్ని సంవత్సరాలైంది.

మనుషులు మోసం చేశారు

మనుషులు మోసం చేశారు

సినిమా ఎప్పుడూ నాకు తప్పు చేయలేదు. మనుషులు మోసం చేశారు. నా సెట్లో సినిమా చేసి ఇంకా డబ్బులు ఇవ్వని వారు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి నాకు 23 లక్షలు ఇవ్వాలి. నాకిచ్చే డబ్బు ఇవ్వకుండా సినిమాలు తీస్తున్నారు విడుదల చేసుకుంటున్నారు.

 కొందరిని చూస్తే న్యాయం అనేది లేదనిపిస్తోంది

కొందరిని చూస్తే న్యాయం అనేది లేదనిపిస్తోంది

ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో అతడిపై కంప్లయింట్ పెట్టాము. నాకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఆయన పేరుతో కాకుండా మిగతా వారి పేర్లతో తీస్తున్నారు. న్యాయం అనేది ఎక్కడా లేదు. వ్యక్తిగతంగా చాలా మోసపోయాను.

 మోహన్ బాబు కూతురు అనే పొగరు వల్లే

మోహన్ బాబు కూతురు అనే పొగరు వల్లే

నా పొగరు కూడా ఏమిటంటే... మోహన్ బాబు గారి కూతురును నన్నెవరు మోసం చేస్తారు అనుకుంటాను. అలా అనుకోవడం వల్లే చాలా మంది నన్ను ఈజీగా మోసం చేశారు.

ఏమైనా అంటే ముగ్గురు తంతారు అనుకునేదాన్ని

ఏమైనా అంటే ముగ్గురు తంతారు అనుకునేదాన్ని

నన్ను ఎవరైనా ఏమైనా అంటే ముగ్గురు తంతారు అనుకునేదాన్ని. కానీ తన్నడాన్ని కూడా మీడియా ఒక విషయాన్ని పది రకాలుగా చూపిస్తుంది. అందుకే డాడీ కూడా వాళ్ల కర్మకు వాళ్లు పోతారు అని వదిలేస్తున్నారు. నీ మనసు నాకు తెలుసు తల్లి.. నిన్ను మోసం చేసిన వాడికి దేవుడు తగిన శాస్తి చేస్తాను అంటుంటారు అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు.

 జీవితం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది

జీవితం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది

ఇలా మనుషులను నమ్మి మోసపోయాను కానీ సినిమాను నమ్మి మోసపోలేదు. జీవితం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. అలాంటి వాళ్లను చూసినపుడు చాలా కోపం వస్తుంది. గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళతారా? నరకానికి వెళతారా అనేది నేను నమ్మను. మనం పోయేలోపు అన్నీ ఇక్కడే అనుభవిస్తాం అనేది నమ్ముతాను.

పరిస్థితి ఇపుడు మారింది

పరిస్థితి ఇపుడు మారింది

ఒకప్పుడు యాక్టింగ్ కెరీర్ అంటే 60 నుండి 70 ఏళ్ల పాటు కొనసాగేది. ఇపుడు 6 సంవత్సరాలు ఉంటేనే గొప్ప. నువ్వు టాప్ పొజిషన్లో ఉంటే తప్ప ఎక్కువ కాలం కెరీర్ కొనసాగడం లేదు. వరుసగా నాలుగైదు ప్లాపులు పడితే మీ ప్లేసులోకి మరొకరు వస్తారు.

ఇతర వ్యాపారాలు

ఇతర వ్యాపారాలు

అందుకే ఇపుడు కేవలం సినిమాల మీదే డిపెండ్ కావొద్దు. ఇతర వ్యాపారాలు కూడా చేయాలి. అందుకే జూనియర్ కుప్పన్న హోటల్ బిజినెస్ లోకి దిగాను. ఆ బిజినెస్ అంతా ఆండీ చూసుకుంటున్నారు.. అని మంచు లక్ష్మి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X