మోహన్ బాబు మనసు మారాలి.. మనోజ్ పెళ్లి తర్వాతే అలా.. మంచు లక్ష్మి కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొంది కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. విలక్షణ నటుడిగా, తనదైన డిఫరెంట్ మ్యానరిజం డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. 90వ దశకంలో ఆయన హీరోగా చేసిన పలు హిట్ సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మంచు కుటుంబంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. మంచు విష్ణు- మనోజ్ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వైరల్ అయిన వీడియో ద్వారా బయటకు వచ్చింది. తాజాగా ఈ విషయంపై మంచు లక్ష్మి కామెంట్స్ చేసింది. ఆమె చెప్పిన మాటలు ఏంటని చూస్తే..

వీడియో వైరల్: సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచు మోహన్ బాబు సూపర్బ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయను ముగ్గురు పిల్లలు ఇండస్ట్రీలో నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆయన కుమారులు మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు ఉన్నట్లుగా ఓ వీడియో హల్ చల్ చేసింది. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి పలు విషయాలు తెలిపింది.

Manchu Lakshmi

మనస్పర్థలు: మంచు మనోజ్-భూమా మౌనిక పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను తానే చూసుకుంది మంచు లక్ష్మి. ఈ పెళ్లి విషయానికి సంబంధించి వచ్చిన మీడియా కథనాలపై మంచు లక్ష్మి తాజాగా మాట్లాడింది. మనోజ్ పెళ్లి విషయంలో తమ కుటుంబంలో మనస్పర్థలు వచ్చిన మాట నిజమే అని మంచు లక్ష్మి తెలిపింది. అయితే తర్వాత అన్నీ సర్దుకున్నాయని కూడా తెలిపింది.

Manchu Lakshmi

రెండు కుటుంబాల్లో: "నేను మనోజ్-మౌనికల పెళ్లి జరగాలని నేను యాదాద్రిలో మొక్కుకున్నాను. నా తండ్రి మనసు మార్చాలని దేవుడిని కోరుకున్నాను. ఆ దేవుడు ఆలకించి నా కోరిక నెరవేర్చాడు. మనోజ్ పెళ్లి జరిగింది. మనోజ్ పెళ్లి విషయంలో మా రెండు కుటుంబాల్లో చాలా ఈక్వెషన్స్ చేసుకోవాల్సి వచ్చింది" అని మంచు లక్ష్మి అసలు విషయం చెప్పుకొచ్చింది.

Manchu Lakshmi

పెళ్లి తర్వాతే: "మనోజ్, మౌనిక ప్రేమించుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. ప్రేమకు ఏదీ అతీతం కాదు కదా అని వాళ్ల పెళ్లి నా ఇంట్లో చేశాను. పెళ్లికి ముందు కూడా వాళ్లు ఇద్దరూ నా వద్దే ఉన్నారు. పెళ్లి తర్వాత వేరే ఇల్లు తీసుకున్నారు. నాకు ఏ కష్టం వచ్చిన మనోజ్ ముందుండేవాడు. అందుకే తన ప్రేమకు నేను అండగా నిలబడ్డాను" అని మంచు లక్ష్మి పేర్కొంది.

Manchu Lakshmi

ఒక అమ్మాయే: "అప్పుడప్పుడు నాకు మౌనిక ఫోన్ చేసి వంటల గురించి అడుగుతుంది. ఏది ఎంత వేయాలి. ఎలా చేయాలి అడుగుతుంది. కానీ నేను చెప్పకుండా ఆటపట్టిస్తాను. నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం. మేము కూడా ముగ్గురు పిల్లలను కనాలని అనుకున్నాం. కానీ ఆ దేవుడు మాకు ఒక అమ్మాయినే ఇచ్చాడు. నాకు రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం" అని చాలా విషయాలపై స్పందించింది మంచు లక్ష్మి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X