ఆఫర్స్ కుప్పలుకుప్పలుగా వస్తున్నా.. కావాలనే రిజెక్ట్ చేస్తోందట.. మంచు లక్ష్మి

మంచు లక్ష్మీ సినిమాలతో కంటే కూడా తన లైఫ్ స్టైల్ తోనే జనాలను ఎక్కువగా ఆకర్షించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె మాట్లాడే స్టైలిష్ ఇంగ్లీష్ నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక విధంగా వైరల్ అవుతూనే ఉంటుంది. మంచు లక్ష్మీ ఏం మాట్లాడినా కూడా ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతోంది. ఇకపోతే చాలా రోజుల నుంచి మంచు లక్ష్మీ సినిమాల్లో కనిపించడం లేదు. అందుకు గల కారణాన్ని ఇటీవల వివరించింది.

నిర్మాతగా ఫెయిల్..

నిర్మాతగా ఫెయిల్..

మంచు లక్ష్మీ కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. నటిగా అప్పుడప్పుడు మంచి గుర్తింపు అందుకున్నప్పటికి నిర్మాతగా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ముఖ్యంగా ఉ కొడతారా ఉల్లికిపడతారా సినిమా అయితే భారీ నష్టాలను మిగిల్చింది. ఇక దొంగాట తరువాత మళ్ళీ ప్రొడక్షన్ వైపు వెళ్లలేదు.

నటిగా బిజిగానే ఉన్నా..

నటిగా బిజిగానే ఉన్నా..

అనగనగా ఒక ధీరుడు సినిమాలో మంచు లక్ష్మీ లేడి విలన్ గా ఏ స్థాయిలో మెప్పించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఆమె కెరీర్ మరో రేంజ్ లో ఉండేది. అనంతరం సపోర్టింగ్ రోల్స్ తో పాటు మెయిన్ లీడ్ గా కూడా బాగానే బిజీ అయినప్పటికీ అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు. ఇక మంచు లక్ష్మీ.. లక్ష్మీ బాంబ్ తరువాత మళ్ళీ కనిపించలేదు.

కుప్పలుకుప్పలుగా....

కుప్పలుకుప్పలుగా....

W/o రామ్ అనే సినిమాతో రానున్న మంచు లక్ష్మీకి కొత్త ఆఫర్స్ కుప్పలుకుప్పలుగా వస్తున్నా కూడా ఒకే చేయడం లేదట. అందుకు ఒక కారణం కూడా ఉందట. క్యారెక్టర్ క్లిక్కయ్యే విదంగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇంతవరకు ఆమెకు తగల్లేదట. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేయాలని అనుకుంటోందట. అందుకే అనవసరమైన కథలను ఓకే చేయడం లేదని చెబుతోంది.

Recommended Video

#DecadeOfVedam : Allu Arjun & Vedam Team Cherishes Memories
లేటయినా కూడా..

లేటయినా కూడా..

లేటయినా కూడా మంచి పాత్రలతో వస్తానని ఇటీవల లక్ష్మీ ఒక క్లారిటి అయితే ఇచ్చింది. ఇక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అనే రూమర్స్ కి కూడా క్లారిటీ వచ్చినట్లయ్యింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాట్ చేస్తూ సామాజిక అంశాలపై కూడా మంచు లక్ష్మీ స్పందిస్తోంది. ఇటీవల దర్శకుడు క్రిష్ ఆన్లైన్ క్లాసెస్ పై చేసిన కామెంట్స్ కి కౌంటర్ వేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X