మంచు లక్ష్మి గొప్ప మనసు.. ఎవరూ చేయని విధంగా దత్తత.. చేతల్లో చూపిస్తామంటూ!
తెలుగు ఇండస్ట్రీలోని అతిపెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం నుంచి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. బాలనటిగా సినిమాలు చేసిన ఈ మంచువారి అమ్మాయి మొదట్లో హాలీవుడ్, తర్వాత తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే విలన్ గా చేసి నటనలో తన ప్రతిభ ఏంటో నిరూపించింది. ప్రస్తుతం సినిమాలతో పెద్దగా బిజీగా లేని మంచు లక్ష్మి సామాజిక సేవతో అందరిని ఆకట్టకుటుంది. తాజాగా ఎవరూ చేయని విధంగా దత్తత తీసుకుని మరోసారి ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మంచి మనసు: విదేశాల్లో పెద్ద చదువులు చదివిన మంచు లక్ష్మి అక్కడ నటిగా శిక్షణ తీసుకుని హాలీవుడ్ సినిమాలతో మెప్పించింది. అనంతరం అనగనగా ఒక ధీరుడు సినిమాలో విలన్ పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనేక సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకున్న మంచు లక్ష్మి తాజాగా గొప్ప మనసు చాటుకున్నారు.

టీచ్ ఫర్ చేంజ్: మంచు లక్ష్మి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఏకంగా 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సర్కారు బడులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది వెనుకబడిన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు.

ఆగస్టులోపు: "గతేడాది యాదాద్రి జిల్లాలో 30 ప్రభుత్వ బడులను దత్తత తీసుకుని అభివృద్ధి చేశాం. ఈ సంవత్సరం జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వం పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాం. ఈ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ క్లాసులు, మౌలిక వసతులు కల్పిస్తాం. ఆగస్టు లోపు క్లాస్ రూమ్స్ సహా అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా ప్రణాలిక సిద్ధం చేసుకున్నాం" అని మంచు లక్ష్మి వెల్లడించారు.

వేర్వేరు జిల్లాల్లో: "కలెక్టర్ గారి సమక్షంలో దత్తత పత్రాలపై సంతకం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి చదువుకోలేని పేద విద్యార్థులకు మా టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా నాణ్యమైన విద్య అందాలన్నదే మా లక్ష్యం. అందుకే ప్రతి సంవత్సరం వేర్వేరు జిల్లాలకు వెళ్లి సరైన మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం" అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

మాకు చెప్పండి: "మంచు లక్ష్మి ఇంకా మీడియాతో మాట్లాడుతూ.. మేము మాటలు చెప్పడం కాదు. చేతలతో చేసి చూపిస్తాం. మేం చేస్తున్న పనిని మీరు కూడా ప్రశంసిస్తూ.. మీ ఊళ్లలో కూడా అభివృద్ది చేయాల్సిన పాఠశాలలు ఉంటే మాకు తెలియజేయండి. వాటిని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నిస్తాం" అని వెల్లడించారు. ఇలా జిల్లాల్లో 50, 30 స్కూళ్లను దత్తత తీసుకుని ఎవరూ చేయని అభివృద్ధి చేస్తున్నారని మంచు లక్ష్మిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











