ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపిన సినిమా.. ‘మగధీర’పై మంచు ఫ్యామిలీ కామెంట్స్
తెలుగు సినిమా చరిత్రను మార్చిన చిత్రం మగధీర. అంత వరకు చూడని కొత్త రికార్డులను మగధీర క్రియేట్ చేసింది. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం, రామ్ చరణ్ నటన, కాజల్ అందాలు ఇలా ప్రతీ ఒక్కటి కలిసి మగధీరను చరిత్రగా మలిచాయి. ఈ చరిత్రకు నేటికి పదకొండేళ్లు అయ్యాయి. మగధీరను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన అల్లు అరవింద్‌కు అదిరిపోయే హిట్ లభించింది. ఈ క్రమంలో మగధీర రికార్డులను, వింతలను, విశేషాలను సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.
వెయ్యి రోజులు ఆడిన సెంటర్లు, బాక్సాఫీస్ రికార్డులను ట్వీట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇండస్ట్రీ హిట్‌కు పదకొండేళ్లు అంటూ 11YearsForIHMagadheera అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ సైతం ఎమోషనల్ అయ్యాడు. దర్శకుడు రాజమౌళికి, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపాడు.

క్లాసిక్ మూవీకి పదకొండేళ్లు.. రాజమౌళి, చిత్రయూనిట్‌కు కుదోస్.. ఇంకా ఇలాంటివి చేయాలి మిత్రమా రామ్ చరణ్ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఇక మంచు లక్ష్మీ స్పందిస్తూ.. 'మగధీర కేవలం ఇండస్ట్రీ హిట్ మాత్రమే కాదు.. మన తెలుగు పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసిన సినిమా ఇది. ఇదంతా కేవలం టీమ్ వల్లే సాధ్యమైంది. కుదోస్ టు డియరెస్ట్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, రాజమౌళి' అంటూ పేర్కొంది.


Click it and Unblock the Notifications











