స్వచ్ఛ భారత్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు ఎంతో అద్బుత స్పందన వచ్చింది. దేశంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు.
తాజాగా స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి, నిర్మాత లక్ష్మి మంచు ఎంపికయింది. సెప్టెంబర్ 10న రాష్ట్రపతి భవన్‌లో పలువురు ప్రముఖుల మధ్య రాష్ట్రపతి ఆమెను ఈ బాధ్యతలు అప్పగించనున్నారు.

ఈ సందర్భంగా లక్ష్మిమంచు మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అందుకొని, నా స్థాయిలో నేను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం మరింత బాధ్యత పెంచిందన్నారు.
ఈ నెల 10న ఢిల్లీలోని రాష్ర్టపతి కార్యాలయంలో రాష్ర్టపతి చేతుల మీదుగా గౌరవాన్ని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ర్టాన్ని స్వచ్చ తెలంగాణగా మార్చడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇంతటి గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు' అన్నారు.


Click it and Unblock the Notifications











