Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బర్త్ డే స్పెషల్: భర్తతో మంచు లక్ష్మి రొమాంటిక్ మూమెంట్స్ (ఫోటోస్)
హైదరాబాద్: మంచు లక్ష్మి..... టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. మోహన్ బాబు కూతురిగా సినీ రంగానికి పరిచయమైనా. తనైదన స్టైల్, ఆటిట్యూడ్, ఫ్యాషన్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అటు నటిగా, నిర్మాతగా వెండి తెరపై... వినూత్నమైన టీవీషోల ద్వారా బుల్లి తెరపై రాణిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఈ రోజు మంచు లక్ష్మి పుట్టినరోజు. 1977 అక్టోబర్ 8న జన్మించిన లక్ష్మి నేడు 39వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఇండస్ట్రీలో మోహన్‌బాబు క్రమశిక్షణకు మారు పేరు. లక్ష్మి కూడా అలానే పెరిగింది.
నిర్వాణ బర్త్ డే పార్టీ: చీఫ్ గెస్టులు బాలయ్య మనవడు, బన్నీ కొడుకు (ఫోటోస్)

విద్యాభ్యాసం
లక్ష్మి పదో తరగతి వరకు చెన్నైలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ కళాశాలలో చదివారు. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌ని అభ్యసించారు. తర్వాత అమెరికా వెళ్లి థియేటర్ ఆర్ట్స్ చేసారు.

సినిమా కుటుంబంలో పుట్టడం వల్లే
సినిమా కుటుంబంలో పుట్టి, పెరడంతో లక్ష్మీప్రసన్న కూడా సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. నటనపై ఆమెకు ఉన్న ఆసక్తి అమెరికాలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేస్తున్న సమయంలోనే అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘లాస్ వేగాస్'లో నటించేలా చేసింది.

ఇంగ్లీష్ సినిమాలు
తర్వాత బోస్టన్ లీగల్, మిస్టరీ ఈఆర్, డెస్పరేట్ హౌస్‌వైఫ్స్ వంటి హాలీవుడ్ టెలివిజన్ సిరీస్‌లతో పాటు ద ఓడే, డెడ్ ఎయిర్, థాంక్యూ ఫర్ వాషింగ్(షార్ట్‌ఫిల్మ్) వంటి ఆంగ్ల చిత్రాల్లోనూ నటించి మెప్పించారామె.

తెలుగులో నంది అవార్డు
తెలుగులో ‘లక్ష్మీ టాక్ షో'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.... ‘ప్రేమతో మీ లక్ష్మి' లాంటి షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ‘అనగనగా ఓ ధీరుడు' చిత్రం మంత్రగత్తె ‘ఐరేంద్రి'గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు గాను ఆమె లేవీ విలన్ విభాగంలో నంది అవార్డును సైతం అందుకోవడం విశేషం.

సినిమాలు
తర్వాత ‘దొంగల ముఠా', ‘డిపార్ట్‌మెంట్', ‘వూ కొడతారా? ఉలిక్కిపడతారా?', ‘గుండెల్లో గోదారి', ‘చందమామ కథలు', ‘దొంగాట' చిత్రాల్లో నటంచారు. త్వరలో ‘లక్ష్మీ బాంబ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో పాటు విధి వంచితులకు సాయం అందించే ఉద్దేశంతో ‘మేముసైతం' అనే టీవీ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతగానే ఆమె పలు సినిమాలు చేసారు.

భర్త, కూతురుతో
2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె. పేరు విద్యా నిర్వాణ మంచు ఆనంద్. సరోగసీ ద్వారా ఆమె తల్లయింది. అంటే అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడం అన్నమాట. మంచు లక్ష్మి, ఆమె భర్త ఆండీకి సహజ పద్దతిలో పిల్లలు పుట్ట లేదు. చాలా కాలం పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఈ పరిణామ క్రమంలో చివరకు పిల్లలు వద్దనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉండటంతో విధానాన్నిఆశ్రయించి తల్లిదండ్రులయ్యారు.