బతుకమ్మ సంబరాల్లో మంచు లక్ష్మి
హైదరాబాద్: తెలుగు సినీ నటి మంచు లక్ష్మి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేసారు. అంబర్ పేటలోని మునిసిపల్ గ్రౌండ్స్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా మంచు లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మను నెత్తిన ఎత్తుకున్నారు.

బతుకమ్మ సంబరాల్లో భాగంగా మంచు లక్ష్మి ఇక్కడి మహిళలతో కలిసి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ చిన్నతనం నుండి హైదరాబాద్ లోనే పెరగడం వల్ల బతుకమ్మ వేడుకల గురించి మంచి అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ సాంప్రదాయ వేడుక అయిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
మంచు లక్ష్మి సినిమా లైఫ్ గురించిన వివరాల్లోకి వెళితే...సినిమా నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మంచు లక్ష్మి. సినిమా రంగాని మాత్రమే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ దూసుకెలుతున్నారు.


Click it and Unblock the Notifications











