twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆన్‌లైన్ షాపింగ్ చేసుకుంటా.. బ్యాంక్ డిటైల్స్ ఇవ్వు తమ్ముడు.. నెటిజన్‌కు మంచు లక్ష్మీ కౌంటర్

    |

    మోహన్ బాబు వారసత్వంగా మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు లక్ష్మీ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, టీవీ షోలో వ్యాఖ్యాతగా ఇలా పలు రకాలుగా మంచు లక్ష్మీ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. మంచు లక్ష్మీ మీడియా ముందుకు వచ్చిందంటే నవ్వులు పూయాల్సిందే. ఆమె తన భాష, యాసతో అందర్నీ ఆకట్టుకుంటుంది. కొత్త కొత్త పదాలను కనిపెట్టడంలో మంచు ఫ్యామిలీలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ ఉంటుంది.

    సోషల్ మీడియాలో హల్చల్...

    సోషల్ మీడియాలో హల్చల్...

    మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఆమె చేసే ట్వీట్స్, నెటిజన్లకు ఇచ్చే రిప్లైలు వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మీడియాలో మాట్లాడుతూ కొత్త కొత్త తెలుగు పదాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య నిలదీస్‌ఫై అంటూ కొత్త పదాన్ని క్రియేట్ చేయగా.. అది బాగా వైరల్ అయింది. ఈ పదాన్ని మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ ఫన్ క్రియేట్ చేశాడు.

    కూతురితో కలిసి..

    కూతురితో కలిసి..

    మంచు లక్ష్మీ తన కూతురు విద్యతో కలిసి యూట్యూబ్ చానెల్‌ను కూడా ప్రారంభించింది. చిన్న పిల్లలు, తల్లిదండ్రుల రిలేషన్ షిప్, నేటి సమాజంలో పిల్లలు లాంటి కాన్సెప్ట్‌లపై కూతురితో కలిసి వీడియోలు చేస్తూ ఉంటుంది.

    తాజాగా కరోనాపైనా..

    తాజాగా కరోనాపైనా మంచు లక్ష్మీ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. కరోనాను తప్పుగా పలుకుతున్నారని, కరోనా ఆర్ (R) రోల్ అవ్వాలని, కింద పడి అలా దొర్లాలని చెప్పిన వీడియో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ప్రతీ సారి ఆడియెన్స్‌ను ఏదో రూపంలో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది.

    Recommended Video

    Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event
    బ్యాంక్ డిటైల్స్ ఇవ్వు తమ్ముడు..

    బ్యాంక్ డిటైల్స్ ఇవ్వు తమ్ముడు..

    తాజాగా మంచు లక్ష్మీ ఓ నెటిజన్‌కు ఇచ్చిన కౌంటర్ అదిరిపోయేలా ఉంది. ప్రస్తుతం అంతా లాక్ డౌన్‌లో ఉండటంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటివాటిపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో మంచు లక్ష్మీని తన నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఇవ్వమని ఓ నెటిజన్ అడిగాడు. దానికి.. ‘తమ్ముడు నిజంగానా? నీ బ్యాంక్ డిటైల్స్ ఇవ్వు.. ఆన్‌లైన్ షాపింగ్ చేసుకుంటా'నని కౌంటర్ వేసింది.

    English summary
    Manchu Lakshmi Counter To Netizen About Netflix Account. She tweeted That Are u for real? Ne bank details pampu thammudu. Online shopping chesukunta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X