కడుపు తరుక్కుపోతోంది, మా జీవితం అంత దిగజారిపోయిందా? మంచు లక్ష్మి ఫైర్

By Bojja Kumar

Recommended Video

Manchu Lakshmi Talks About Media

సినీ తారల గురించి, వారి క్యారెక్టర్ గురించి మీడియాలో నీచంగా రాయడంపై 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' సీరియస్ అయింది. ఇటీవల ఓ టీవీ చానల్‌ చర్చా కార్యక్రమంలో ఓ న్యూస్ ప్రజెంటర్ సినిమా ఇండస్ట్రీలోని తారలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 'మా' సభ్యులు.... మంగళవారం సమావేశం అయి తమ పట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ తమను మీడియా లోకువ చేసి నీచంగా ఫోకస్ చేయడాన్ని ఖండించారు.

ఓ సెక్యూరిటీ లేకుండా పోయింది

ఓ సెక్యూరిటీ లేకుండా పోయింది

ఓ నెల రోజుల క్రితం నా గురించి వెబ్ సైట్లో తప్పుగా రాశారు. ఇది నాన్న(మోహన్ బాబు) చూసి వెంటనే తగిన విధంగా స్పందించు అన్నారు. నేను ఆయనతో రాయనివ్వండి, ఐ డోంట్ కేర్ అన్నాను. ఆయనకు నాకు గంట పాటు వాదన జరిగింది. తప్పును తప్పుగా నిలదీయాలి, ఇలా ఊరుకుంటారేంటి? అని నాన్న ప్రశ్నించారు. నాన్న ఇది తీస్తే ఇంకొకటి రాస్తారు, ఈ రోజు ఒక సెక్యూరిటీ లేకుండా అయిపోయింది... అని మంచు లక్ష్మి అన్నారు.

కడుపు తరుక్కుపోతోంది

కడుపు తరుక్కుపోతోంది

నాకు చిన్నప్పటి నుండి ప్రెస్ వాళ్లు తెలుసు. చిన్న తనం నుండి వాళ్ల ఒళ్లో కూర్చుని పెరిగాను. ఈ రోజు వారి గురించి తలదించుకుని మాట్లాడాలంటే కడుపు తరుక్కుపోతోంది. ఎన్నో రోజులు ఊరుకున్నాం. పరిస్థితి ఎలా తయారైందంటే... మా గురించి మీరు క్రియేట్ చేసే వార్తలు, గాసిప్‌లు కామెడీ అయిపోయాయి. ఇలాంటిది మనకు సిగ్గుచేటు. మనం చాలా గర్వంగా మా వూరు, మా ప్రదేశం అని చెన్నై నుండి వచ్చింది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి కాదు. ఎప్పుడూ ఇలా జరుగలేదు. ఇలా జరుగడం ఎప్పుడూ చూడలేదు.... అని మంచు లక్ష్మి అన్నారు.

మా మొహాలు పెట్టుకుని మీరు డబ్బు సంపాదించుకుంటున్నారు

మా మొహాలు పెట్టుకుని మీరు డబ్బు సంపాదించుకుంటున్నారు

న్యూస్ చానల్స్, వెబ్ సైట్లు సెన్సేషనలిజంగా రాసి... తీరా అక్కడికి వెళ్లి క్లిక్ చేస్తే అక్కడ ఏమీ ఉండదు. మేము లిప్‌స్టిక్ వేసుకోవడమో, మేము బట్టలేసుకోవడమో? ఎక్కడో నడుచుకుంటూ వెళ్లడమో తప్ప ఏమీ ఉండదు. మా మొహాలు పెట్టుకుని మీరు డబ్బు సంపాదించుకుంటున్నారని మాకు తెలుసు. బతకండి, మీకు స్పెషల్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాం, ఎవరు వచ్చినా నో అని చెప్పడం లేదు. వంద మంది కాదు వెయ్యి మంది బతకండి. మా గురించి తప్పుతప్పుగా రాసి కూడా లక్షల మంది బతుకుతున్నారు. తప్పుగా రాయడం ఎందుకు? మీకు ఏం కావాలన్నా మేము ఎప్పుడూ నో అని చెప్పలేదు కదా... అని మంచు లక్ష్మి అన్నారు.

దాసరి అంకుల్ ఉంటే...

దాసరి అంకుల్ ఉంటే...

దాసరి నారాయణరావు అంకుల్ ఉండి ఉంటే ఈ రోజు మేము ఇలా మీటింగ్ పెట్టేవారం కాదు. ఏం న్యాయం జరుగాలో ఆల్రెడీ జరిగిపోయి ఉండేది. ప్రెస్‌క్లబ్ వారిని నేను అడుగుతున్నాను... మీలో ఒక జర్నలిస్ట్ బాధ్యతారాహిత్యంగా మా గురించి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకున్నారు? మిమ్మల్ని ఒక్క మాట అంటే మొత్తం ఐక్యం అయిపోతారు, తప్పో ఒప్పో ఆలోచించరు.... మా గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్లారు. మీరు అలా మాట్లాడుతుంటే మేము ఎందుకు ఊరుకోవాలి? మేము ఊరుకునేకొద్దీ మీరు రెచ్చిపోతూ ఉంటారా?... అంటూ మంచు లక్ష్మి మండి పడ్డారు

డబ్బులు తీసుకుంటున్నారుగా...

డబ్బులు తీసుకుంటున్నారుగా...

మేము డబ్బులిస్తేనే కదా మీరు ఏ ఛానల్లో అయినా మా గురించి, మా సినిమాల గురించి రాసేది, ఫ్రీగా ఏమీ చేయడం లేదు కదా. పొలిటికల్ గా కావాలంటే మేము కూడా కాంపెయిన్ చేస్తాం. ఈ రాష్ట్రమే కాదు, పక్కరాష్ట్రానికి కూడా వెళ్లి కాంపెయిన్ చేశాం. మీకు ఏం కావాలో అడగండి, అందరికంటే ముందు ఉండేది మేము కదా, ఎక్కడో సైక్లోన్ వస్తే మేము కదా బండి కట్టుకుని బయల్దేరేది, మా అసోసియేషన్‌కు ఒక బిల్డింగ్ కూడా లేదు అయినా ప్రజలకు ఎలాంటి సహయం చేయాలన్నా మేము ముందుంటున్నాం. మా గురించి ఇలా రాస్తున్నపుడు ఏ పొలిటీషియన్ వచ్చి మా వాళ్లు వీళ్లు రాయొద్దు అని ఎవరైనా చెబుతున్నారా? అని మంచు లక్ష్మి ప్రశ్నించారు.

మా జీవితం అంత దిగజారిపోయిందా

మా జీవితం అంత దిగజారిపోయిందా

మేమేదో మా బతుకుదెరువు మేము చేసుకుంటున్నాం. ఉన్న ప్రాణాలన్నీ పోసి సినిమాలు చేస్తున్నాం. మా వల్ల రోజూ రెండు మూడు వందల మంది బ్రతుకుతున్నారు. వెబ్ సైట్లు మా గురించి సెన్సేషనలైజ్‌గా రాస్తే ఒక్క క్లిక్కుకు రెండు పైసలో, మూడు పైసలో, ఐదు పైసలో వస్తాయి. మా జీవితం అంత దిగజారిపోయిందా మీకు, మీ ఫ్యామిలీస్ గురించి ఎందుకు రాసుకోరు? మీ అందరినీ ఒక ఫ్యామిలీగా అనుకున్నాం. మా గురించి రాసేపుడు ఒకసారి ఆలోచించుకోండి, తప్పు చేస్తే నిలదీసే హక్కు ఉంది. కానీ ఏమీ చేయకున్నా నీచంగా రాసే హక్కు మీకు లేదు... అని మంచు లక్ష్మి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X