మందు కొట్టా... పంచులతో మంచు లక్ష్మికి నాగార్జున ఝలక్.... పిచ్చి ప్రశ్నలు వద్దన్న నాని!
Recommended Video

'దేవదాస్' సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ మూవీ స్టార్స్ నాగార్జున, నాని, రష్మిక, ఆకాంక్షలతో.... మంచు లక్ష్మి ఓ స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ప్రశ్నలు అడుగుతుంటే వారంతా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
సినిమా షూటింగ్ మొదలైన రెండో రోజు నాగ్ సర్ జాయిన్ అయ్యారు. నాగ్ సర్‌ది ఫస్ట్ షాట్ వాకింగ్ షాట్. ఆయన స్టార్ట్ చేయగానే యూనిట్లో ఉన్న మొత్తం జూనియర్స్, డాన్సర్లు, డాన్స్ మాస్టర్లు, మిగతా అందరూ విజిల్స్, క్లాప్స్‌తో ఎంకరేజ్ చేశారు. టేక్ కట్ అయిన వెంటనే నేను షాక్ అయ్యాను. నిన్నటి నుండి నేను బట్టలు చించుకుని డాన్స్ వేస్తుంటే ఒక్క అప్రిషియేషన్ కూడా లేదు. ఒక్కరూ సూపర్ టేక్ అని కూడా అనలేదు. అపుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది.... ఆయనకు ఉన్న క్రేజ్ అది, ఆయన్ను చూసిన వెంటనే ఎనర్జీ ఆటోమేటిక్ గా వస్తుంది. దాన్ని మనం డిమాండ్ చేయకూడదు, వస్తే తీసుకోవాలి... అని నాని తెలిపారు.

సెట్లో మందు కొట్టాను
సినిమాలో మీరెప్పుడూ చేతిలో మందు గ్లాసులో ఉంటారని విన్నాను. షూటింగ్ సమయంలో నిజంగానే మందు సిప్ చేశారా? అనే ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ.... అవును చేసే వాడిని, ఈవింగ్ షూటింగ్ ఉన్నపుడు కొంచెం కొంచెం మందు సిప్ చేసేవాడిని అని నాగార్జున సమాధానం ఇచ్చారు. నాగార్జున చెప్పిన సమాధానంతో మంచు లక్ష్మి ఆశ్చర్యపోయింది. నాకు చెప్పుంటే నేను కూడా జాయిన్ అయ్యేవాడిని కదా... అంటూ నాని అనడం గమనార్హం.

ఐ జస్ట్ లవ్ ఉమెన్
మీరు ఇష్టపుడుతున్న ముగ్గురు హీరోయిన్ల పేరు చెప్పండి అని మంచు లక్ష్మి ప్రశ్నించగా..... డిప్లమాటిక్ అని అనుకోవద్దు, ఐ జస్ట్ లవ్ ఉమెన్. ఎవరి పేరని చెప్పను అంటూ నాగార్జున పంచ్ ఇచ్చారు. నాగార్జున చెప్పిన సమాధానంతో మంచు లక్ష్మి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.

రష్మిక మీద అనుమానాలు
రష్మిక, ఆకాంక్ష ఈ ఇద్దరితో నటించారు... వీరిలో స్పై చేయాలంటే ఎవరిపై చేస్తారు? అని నాగార్జునను మంచు లక్ష్మి ప్రశ్నించగా రష్మిక వైపు చేయి చూపించారు. నేను చాలా నైస్ గర్ల్... నా మీద స్పై చేయడం ఎందుకు అంటూ రష్మిక అనడంతో.... ఐ డోంట్ లైక్ నైస్ గర్ల్స్. నీలో నాకు తెలియని కోణం ఏదో ఉందని నా అనుమానం అంటూ నాగార్జున పంచ్ వేశారు.

ఆకాంక్షను డేట్‌కు తీసుకెళతాను
మిమ్మల్ని ఇపుడు దేవ్‌గా అడగటం లేదు... నాగ్‌గా అడుతున్నాను. రష్మిక, ఆకాంక్ష వీరిద్దరిలో డేట్‌కు తీసుకెళితే ఎవరిని తీసుకెళతారు? అని మంచు లక్ష్మి ప్రశ్నించగా... ఆకాంక్ష అంటూ సమాధానం ఇచ్చాడు నాగ్. దీనికి వెంటనే నాని రియాక్ట్ అవుతూ థాంక్యూ దేవా... బ్రతికించారు అని సమాధానం ఇచ్చారు. ఆమె పాటలు బాగా పాడుతుంది. డేట్ కు తీసుకెళ్లి పాటపాడించుకుంటాను అని నాగ్ చెప్పడంతో... ఆమె కూడా మంచు లక్ష్మి కోరిక మేరకు క్రిమినల్ హిందీ వెర్షన్ పాట పాడి అలరించారు.

ఫోన్ వ్యసనం అంటూ ఆట పట్టించారు
షూటింగులో ఉన్నపుడు నాని ఎప్పుడూ ఫోన్లోనే ఉంటాడని నాగార్జున, మంచు లక్ష్మి ఆటపట్టించారు. దీనికి నాని... నేను నా థాట్స్ నోట్స్ రూపంలో రాసుకుంటాను అని సమాధానం ఇచ్చారు.

నాని రాపిడ్ ఫైర్ ఆన్సర్స్... 10 మార్కులకు ఎన్నంటే?
నటుడిగా... నేను 1 మార్కుతో మొదయ్యాను ఇపుడు 5 మార్కులు వేసుకుంటాను.
డాన్సర్ గా: 5 మార్కులు వేసుకుంటాను
భర్తగా : 7.5 వేసుకుంటా... (మరి రూ. 2.5 సంగతి ఏమిటో అడగండి అంటూ నాగార్జున పంచ్ ఇచ్చారు)
హెస్ట్ గా...: నాకు నేను 10 వేసుకుంటాను.
బెటర్ యాక్ట్రెస్: ఆకాంక్ష
బెటర్ డాన్సర్ నాగ్ ఆర్ యూ: నాగ్ సర్
పిచ్చి ప్రశ్నలు వద్దన్న నాని
ఎవరు హాండ్సమ్...నాగ్, కునాల్ ఆర్ యూ.... ఏంటి పిచ్చి క్వశ్చన్లు అడుగుతావేంటి? ఏదైనా ఇంట్రస్టింగ్ క్వశ్చన్స్ అడుగు. నాని నా సమాధానం నాగ్ సర్ మాత్రమే...అంటూ నాని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











