twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ముగ్గురి జోరును మంచు లక్ష్మి తట్టుకోగలదా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మోహన్ బాబు కూతురుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ మొదటి నుండీ తన కంటూ ప్రత్యేక గుర్తింతెచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మంచు లక్ష్మి ప్రసన్న. తండ్రి మాదిరిగానే డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్‌గా దసుకెళ్లే తత్వం ఉన్న మంచు లక్ష్మి తొలి నాళ్లలో పలు టీవీ షోల్లో ఎంట్రీ ఇచ్చి తనను తానుగా పరిచయం చేసుకుంది.

    అనంతరం నటిగా వెండితెరపై అడుగు పెట్టి తన సత్తా చాటుకుంది. సినిమా నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంది. తాజాగా మంచు లక్ష్మి మరోసారి బుల్లితెర వైపుకు రూటు మార్చింది. 'దూసుకెళ్తా' అనే టీవీ గేమ్ షో ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది. త్వరలో ఈ షో మాటీవీలో ప్రసారం కానుంది.

    అయితే ఇప్పటి బుల్లితెరపై పలు గేమ్ షోలు నిర్వహిస్తూ యాంకర్ సుమ, అనసూయ, ఉదయభాను లాంటి వారు దూసుకెలుతున్నారు. ఇపుడు మంచు లక్ష్మి 'దూసుకెళ్తా' షో ద్వారా వారితో పోటీ పడటానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో....ఆ ముగ్గురికి, మంచు లక్ష్మికి మధ్య పోటీ వాతావరణం ఎలా ఉండబోతోంది? అనేది చర్చనీయాంశం అయింది.

    మంచు లక్ష్మి బుల్లితెరపై తన దృష్టి పెట్టినప్పటికీ.....సినిమాలను వదులుకోలేదు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రానికి చందమామ కథలు అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రానికి చాణక్య బూనేటి నిర్మాత. చైతన్యకృష్ణ, నరేష్, అమని, కృష్ణుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    త్వరలో మంచు లక్ష్మి 'రాయలసీమ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన మంచు లక్ష్మి లుక్ పేయింటింగ్ పోస్టర్ రూపంలో విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో మంచు లక్ష్మి మరో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం అవుతోంది.

    English summary
    News is that Manchu Lakshmi latest TV show is all set to hit the marquee in coming weeks. She is coming up with a game show, whose concept is said to be mind blowing. The name of show is ‘Doosukelta’ and it will be aired on MAA TV in coming days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X