‘మంచు’ వారికి ఆ జబ్బు ఉంది.. చిత్రం శ్రీను కామెంట్‌కు మంచులక్ష్మి కౌంటర్
Recommended Video

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలు, సినిమాలను చేయడంలో మంచులక్ష్మిది ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. సినిమా, టెలివిజన్ రంగాలను దాటేసి ప్రస్తుతం మంచులక్ష్మి డిజిటల్ మీడియాలోకి ప్రవేశించారు. మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్రపంచంలోకి మంచు లక్ష్మి ప్రవేశించారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మీడియా సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను మీడియా ముందు ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే..

మిసెస్ సుబ్బలక్ష్మి వెబ్ సిరీస్ ద్వారా
మిసెస్ సుబ్బలక్ష్మి ద్వారా వెబ్ సిరీస్‌లోకి ప్రవేశించాను. ఈ సిరీస్ మార్చి నుంచి జీ5 ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. భార్య, భర్త మధ్య జరిగే కథతో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. నా కెరీర్‌లో ఇది కొత్త మలుపు అని మంచు లక్ష్మీ చెప్పింది.

మంచు కుటుంబంతో నా అనుబంధం
ఈ సమావేశంలో ‘చిత్రం శ్రీను' మాట్లాడుతూ.. నాకు మంచు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. కానీ మంచు లక్ష్మీతో పెద్దగా పరిచయం లేదు. మంచు విష్ణుతో కలిసి నటించాను. మోహన్‌బాబు బర్త్ డే ఫంక్షన్‌లో కలిశాం. అయితే మంచు లక్ష్మీతో కలిసి నటించ లేదు. ఈ వెబ్‌సిరీస్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నారు.

మంచు లక్ష్మిని చూసి నేర్చుకోవాలని
మంచు లక్ష్మిని చూసి ఓ సమయపాలన నేర్చుకోవాలి. నేను ఈ వెబ్ సిరీస్ కోసం ఓ వారం రోజులపాటు పనిచేశాను. ప్రతీ రోజు మంచు లక్ష్మి కంటే ముందు రావాలని అనుకోనే వాడిని. ఏ రోజు కూడా అలా చేయలేకపోయాను. నేను వచ్చే సరికి సెట్‌లో మంచు లక్ష్మి రెడీగా ఉండేవారు అని చిత్రం శ్రీను అన్నారు.

మా ఫ్యామిలీ అందరికీ అదే
చిత్రం శ్రీను కామెంట్‌కు మంచు లక్ష్మి స్పందిస్తూ.. టైమ్‌కు రావడం నాకు అలవాటు. అంతేకాకుండా మా ఫ్యామిలీలో కూడా ఇది అందరూ పాటిస్తారు. ఇది మంచు వారికి ఉన్న ఓ జబ్బు అని మంచు లక్ష్మి పేర్కొన్నారు. టైమ్‌ను పాటించడం మాకు వారసత్వంగా వచ్చిందని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











