»   » ల‌క్ష్మీబాంబ్... మంచు లక్ష్మిని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫోటోస్)

ల‌క్ష్మీబాంబ్... మంచు లక్ష్మిని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్. ఈ సినిమాను మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ''పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో, మంచి ఎమోషన్స్ తో లక్ష్మీ బాంబ్ సినిమాను రూపొందించాం. అనుకున్న ప్లానింగ్ లో సినిమా పూర్తయ్యింది. మంచు లక్ష్మీగారిని చాలా కొత్త రకంగా ప్రజెంట్ చేసే సినిమా. సునీల్ క‌శ్య‌ప్ సంగీతంలో విడుద‌లైన పాటలు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. సిఅన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

 దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ

``మంచు ల‌క్ష్మిగారి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేయ‌గ‌లిగాం. నిర్మాతలు సురేష్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.... అన్నారు.

 శివరాత్రికి రిలీజ్

శివరాత్రికి రిలీజ్

సునీల్ కశ్యప్ సంగీతం అందించిన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. శివ‌రాత్రి సంద‌ర్బంగా విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది‘‘ అన్నారు.

 నటీనటులు

నటీనటులు


పోసానికృష్ణ మురళి, హేమ, ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్‌, రాజాబాబు, శరత్‌, శ్రీహర్ష, విశాల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

 టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్‌ రెడ్డి, డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: నందమూరి హరి, పాటలు: కరుణాకర్‌,కాసర్లశ్యామ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, కథ, మాటలు: డార్లింగ్ స్వామి, లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్‌.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.

English summary
Manchu Lakshmi New Movie Lakshmi Bomb Release Date Confirmed on Feb 24, 2017.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu