For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీసుల ఎన్‌కౌంటర్ : నేను మరణశిక్షను సమర్థించను.. మంచు లక్ష్మి కామెంట్ వైరల్

  |

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఘటన నిందితులను పోలీసులు నేడు ఉదయం ఎన్‌కౌంటర్ చేశారు. దిశా కేసులో మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. దీనిపై సమాజం మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తున్నారు. ఎవరెవరు ఎలా స్పందించారో ఓ సారి చూద్దాం..

  కొన్ని సార్లు అదే సొల్యూషన్..

  కొన్ని సార్లు అదే సొల్యూషన్..

  దిశ నిందితులను నేటి తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం విదితమే. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సినీ నటులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజా దీనిపై ప్రముఖ నటి సమంత స్పందించింది. మహిళల జోలికి వస్తే భయపడేలా చేయడం మాత్రమే కొన్నిసార్లు పరిష్కారమవుతుందని సామ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ‘ఐ లవ్ తెలంగాణ. భయం అనేది ఒక గొప్ప పరిష్కారం.. కొన్ని సార్లు భయం మాత్రమే పరిష్కారం' అని ట్వీట్ చేసింది.

  ‘దిశ' కు ఇది నిజమైన నివాళి..

  ‘దిశ' కు ఇది నిజమైన నివాళి..

  దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణం గా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ' ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ' తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కెసిఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు" అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

  తాను మరణశిక్షను సమర్థించను..

  తాను మరణశిక్షను సమర్థించను..

  తాను మరణశిక్షను సమర్థించనని కానీ కొన్నేళ్లుగా తాను తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నానని.. రేపిస్టులను ఉరి తీయాల్సిందేనని ప్రముఖ సినీ నటి లక్ష్మి మంచు ట్వీట్ చేసింది. ఆమె ట్విట్టర్ వేదికగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేశారు. ‘నేను తప్పుగా ఏమీ అనుకోవట్లేదు. నేను మరణశిక్షకు వ్యతిరేకిని. కానీ కొన్నేళ్లుగా నేను నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నా. రేపిస్టులను తప్పనిసరిగా ఉరి తీయాలి! మన జాతికి ఉదహరణగా నిలిచినందుకు, మహిళలపై గౌరవాన్ని చూపినందుకు కేటీఆర్ గారికి థాంక్యూ' అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

  #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
   దిశ ఘటన వివరాలు..

  దిశ ఘటన వివరాలు..

  గత నెల 27న దిశపై నలుగురు నిందితులు అత్యాచారం జరిపి.. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. 28న మధ్యాహ్నం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. 29న షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల విచారణ జరిగింది. 30న నలుగురు నిందితులకు జ్యుడీషియల్‌ కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. ఈనెల 4న నిందితులను కోర్టు పోలీస్‌ కస్టడీకి ఇచ్చింది. 5న చర్లపల్లి జైలులో నిందితులను సిట్‌ విచారించింది.

  English summary
  The four accused in brutal rape and murder of veterinary doctor Disha have been encountered by Shamshabad police. Tollywood actors reacted on this issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more