అమితాబ్ ని ప్రశంసలతో మోసేస్తున్న మంచు లక్ష్మీ ప్రసన్న..!
మంచు వారి అమ్మాయి లక్ష్మీ ప్రసన్న హిందీ చిత్రంలో నటించటం చాలా థ్రిల్ గా ఉందంటోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'డిపార్ట్ మెంట్'లో ఆమె సంజయ్ దత్ భార్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ కు పరిచయం అవుతోంది.
ఆ సినిమా విశేషాల గురించి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ..వర్మ దర్శకత్వంలో నటించటం చాలా ఆనందంగా ఉందని, తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాననే అనుకుంటున్నాను. నాకు అంతకు ముందు హిందీ మాట్లాడటం సరిగా రాదు. అయితే ఈసినిమా తర్వాతా చాలా ఇంప్రూవ్ అయ్యాను.
ఈ సినిమాలో నా పాత్రకు డబ్బింగ్ ఎవరు చెబితే బాగుంటుందా అని ఆలోచించి నాకు తోచిన పేర్లు లిస్ట్ రాసుకున్నాను. అయితే వర్మ మాత్రం ఆలిస్ట్ తీసి పక్కన పడేసి నాతోనే డబ్బింగ్ చెప్పించారు. మాటల్లో యాస రాకుండా ఫర్ ఫెక్ట్ గా డైలాగ్స్ చెప్పాను. ఈ సినిమా చూసి అభిప్రాయం చెప్పాలన్నారు.
సంజయ్ దత్ ఎంత సీనియర్ నటుడో మన అందరికి తెలుసు అని అయితే తెర వెనక మాత్రం చాలా షై ఫీల్ అయ్యే వ్యక్తి. చాలా కూల్ గా సింపుల్ గాఉంటారు. ఇక బిగ్ బి అమితాబ్ లెజాండ్ అంటూ లక్ష్మీప్రసన్న ప్రశంసలతో ముంచెత్తింది. అమితాబ్బచ్చన్, సంజయ్ దత్, బిపాసాబసు, లక్ష్మీప్రసన్న, రాణా, మధుశాలినీ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











