»   »  వామ్మో.....మంచు ‘లక్ష్మీ బాంబ్’ (ఫోటోస్)

వామ్మో.....మంచు ‘లక్ష్మీ బాంబ్’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'లక్ష్మీ బాంబ్' అనే చిత్రం తెరకెక్కుతోంది. 'ఫ్రమ్ శివకాశి' అనేది ట్యాగ్ లైన్.

'లక్ష్మీ బాంబ్' చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ముహుర్తపు సన్నివేశానికి మంచు విష్ణు క్లాప్ కొట్టగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సినిమా గురించి మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ 'ఒక నటిగా ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా పవర్ ఫుల్ జడ్జ్ పాత్రలో కనిపించబోతున్నాను. కార్తికేయ గోపాలకృష్ణగారు కథ చెప్పగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. సినిమా ఎప్పుడు స్టార్టవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం'' అన్నారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

కామెడీ థ్రిల్లర్

కామెడీ థ్రిల్లర్


ఇదో మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్. మంచు లక్ష్మీగారు జడ్జ్ పాత్రలో కనపడనున్నారు. చాలా పవర్ ఫుల్ రోల్ అని దర్శకుడు కార్తీకేయ గోపాలకృష్ణ తెలిపారు.

షూటింగ్

షూటింగ్


వచ్చే నెల నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను కంప్లీట్ చేస్తాం. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతానందిస్తున్నారని తెలిపారు.

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ


పావళి టపాసుల్లో లక్ష్మీ బాంబ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ సినిమాలో లక్ష్మీ గారి పాత్ర అలా ఉంటుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది'' అన్నారు.

సునీల్ కశ్యప్

సునీల్ కశ్యప్


మాట్లాడుతూ ‘'సినిమాలో సంగీతం చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి కథ-మాటలు: డార్లింగ్ స్వామి, ఆర్ట్: రఘుకులకర్ణి, డ్యాన్స్: రఘు, సంగీతం: సునీల్ కశ్యప్, ఫోటోగ్రఫీ: అంజి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ

English summary
Manchu Lakshmi Prasanna's Lakshmi Bomb movie launch today at Annapoorna studio.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu