వచ్చే నెల నుంచే నిర్మాతగా మంచు లక్ష్మీ ప్రసన్న రెండో చిత్రం
'ఝుమ్మంది నాదం' చిత్రంతో నిర్మాతగా తెరంగ్రేటం చేసిన మంచు లక్ష్మీ ప్రసన్న వచ్చే నెల నుంచి రెండో చిత్రం ప్రారంభించనుంది. ఆ కొత్త చిత్రం టైటిల్ 'వూ కొడతారా...ఉలిక్కిపడతారా'. ఈ చిత్రం గురించి అందులో హీరోగా చేస్తున్న మంచు మనోజ్ మాట్లాడుతూ.....సినిమా అంతా ఉలిక్కిపడేలాగే ఉంటుంది. ఈ నా డ్రీమ్ ప్రాజెక్ట్ కృష్ణవంశీ శిష్యుడైన రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఆ చిత్రం కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ప్రమాణాలతో ఆ చిత్రం ఉంటుంది అంటున్నారు. అలాగే కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఈ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంతో హీరోగా సెటిల్ అవుతాడేమో చూడాలి.
లక్ష్మీ ప్రసన్న వూ కొడతారా... ఉలిక్కిపడతారా మనోజ్ కుమార్ షీనా బిందాస్ lakshmi prasanna manoj kumar sheena bindaas raghavendra rao


Click it and Unblock the Notifications