For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మంచు లక్ష్మి ప్రసన్న హాట్ ఫోటో షూట్(ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: 'అనగనగా ఓ ధీరుడు'చిత్రంతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న లక్ష్మీ ప్రసన్నకు నటన అనేది బ్లడ్ లోనే ఉందని చెప్పాలి. మోహన్ బాబు కుమార్తెగా పరిశ్రమలో ప్రవేశించిన ఆమె తన నటనకు గానూ నంది అవార్డు సాధించింది. నిర్మాతగానూ వరసగా సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తోంది. విభిన్నమైన చిత్రాలకు ఆమె తన బ్యానర్ ని వేదికగా మార్చింది.'అనగనగా ఓ ధీరుడు'లో ఐరేంద్రి పాత్రతో 2011 ఉత్తమ ప్రతినాయిక నందికి ఎంపికైంది. తాజాగా గుండెల్లో గోదావరి చిత్రంతో నటిస్తూ నిర్మిస్తున్న ఆమె, ఓ ఫోటో షూట్ తో గ్లామర్ లో నూ మిగతా హీరోయిన్స్ తో పోటీ ఇస్తానంటోంది.

  మంచు లక్ష్మికి మొదటి నుంచి మోహన్ బాబు కుమార్తెగా కాక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని కోరుకుంది. అదే దారిలో ఆమె నటిగా ప్రూవ్ చేసుకుని తన తండ్రి అన్ని సంవత్సరాల కెరీర్ లో దొరకని నంది అవార్డుని సంపాదించుకుంది. తండ్రి బాటలోనే విలన్ గా ఎంపికవటం సంతోషమంటోంది. అలాగని ఆమె చూపు గ్లామర్ వైపు లేదనుకోకూడదు. ఆమె నటిస్తూ,నిర్మిస్తున్న గుండెల్లో గోదావరి చిత్రంతో ఆమె తెలుగువారి గుండెల్లో కొలువు ఉంటానని ధీమాగా చెప్తోంది. మరో ప్రక్క తన పేరు మీద ఓ బ్రాండ్ తో ఫెరఫ్యూమ్స్ వదులుతూ మార్కెట్లో తాను ఎవరికీ తీసిపోనని నిరూపిస్తోంది.

  'అనగనగా ఓ ధీరుడు' తరవాత విలన్ పాత్రలు కాదు కానీ... హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలైతే వచ్చాయి. కానీ నాకున్న కొద్దిపాటి అవగాహనతో ఆలోచిస్తే.. ఆ సినిమాల్లో నా పేరు వాడుకొని మార్కెట్‌ చేసుకొనే ఉద్దేశమే కనిపించింది. నా సంతృప్తి ముఖ్యం. నటిగా ఎంతో కొంత నేర్చుకోవాలి. అలాంటి కథలే ఒప్పుకొంటా అన్నారు మంచు లక్ష్మి ప్రసన్న.

  'అనగనగా ఓ ధీరుడు' థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఎన్ని విజిల్స్‌ వేశారో. సినిమా పూర్తయ్యాక 'నీ నటనకు నా గులామ్‌..' అన్నారు. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలెవరైనా భోజనం చేయకపోతే 'ఐరేంద్రీ వస్తుంది..' అని భయపెడితే గబగబా తినేస్తున్నారట. ఇలాంటివి వింటుంటే మరింత సంతృప్తిగా ఉంటుంది.

  మంచు లక్ష్మి ప్రసన్న ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న కడలి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఓ గ్రామీణ యువతిగా, నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తోందని తెలిసింది.

  ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం సినిమా ఫలితం ఎలా ఉన్నా మంచు లక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయన్నది మాత్రం నిజం.

  తాజాగా తమ బ్యానర్ లో తనే నిర్మిస్తున్న ‘గుండెల్లో గోదారి'లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతిగా అదరకొట్టనుందని సమాచారం. ఈ మేరకు విడుదల చేసిన ఫోటోలు అందరి ప్రశంసలు పొందుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ లో కనపడి తన అభిమానులను అలరించనుంది.

  మంచు లక్ష్మి ప్రసన్న పేరు మీద త్వరలో మార్కెట్లో ఫెరఫ్యూమ్స్, డియోడరెంట్స్ దొరకనున్నాయి. తన సొంత పేరు మీద ఓ బ్రాండ్ స్ధాపించి ఆమె ఇలా ఫెరఫ్యూమ్స్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

  మంచు ఎంటర్టైన్మెంట్స్ అంటూ తను సొంతంగా బ్యానర్ పెట్టుకోవటంపై తన తండ్రి మోహన్ బాబుకు కోపం ఏమీ లేదని, అంతేగాక తనకు బ్యానర్ విషయమై అనేక సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది. తాను, తన భర్త సంతోషంగా ఉండటం ఆయన ఆశిస్తున్నారని చెప్తోంది.

  మణిరత్నం కడిలిలో.. మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రంతో మంచు లక్ష్మిలో పరిపూర్ణ నటి ఆవిష్కృతమవుతుందని అంటున్నారు.

  English summary
  Lakshmi Prasanna Manchu is an Indian film actress, model, producer and a television host. She is the only daughter of actor Mohan Babu and late Vidya Devi. She has graduated with a Bachelors in Theater from Oklahoma City University.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X