ముంచుకొస్తున్న ‘మంచు’ ఛతుష్టయము...
మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న టీవీ షోలు, తెరవెనుక బాధ్యతలతో పాటు నటిగాను నిరూపించుకునేందుకు ప్రస్తుతం చాలా కష్టపడుతోంది. తండ్రికి తగ్గ తనయ అనిపించుకోవడానికో ఏమో ఆమె తొలి చిత్రంలోనే విలన్ రోల్ చేస్తోంది. సిద్దార్థ హీరోగా ప్రకాశ్ రావ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అనగనగా ఒక ధీరుడు" చిత్రంలో మంచు లక్ష్మి రాక్షసి పాత్ర పోషిస్తోంది.
చందమామ కథలాంటి ఫాంటసీ సబ్జెక్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే మిగతా వారి మాట ఎలా ఉన్నా మంచు లక్ష్మి మాత్రం తన పాత్ర కోసం చాలా చాలా తిప్పలు పడుతోంది. మేకప్ కోసమే గంటలు గంటలు కేటాయిస్తూ వృత్తి పట్ల నిబద్దత చాటుకుంటోంది. ఈ చిత్రం విడుదలయ్యాక తనకు నటిగా మరిన్ని మంచి ఆఫర్స్ వస్తాయని ఆమె ఆశిస్తోంది. అందుకే ప్రస్తుతం ఎంతమంది అడిగినా కూడా ఈ చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాలని ఆమె అనుకుంటోంది. హీరోయిన్ గాను నటించాలని ఉందని, ఆ సన్నాహాలు కూడా జరుగుతున్నాయని చూచాయగా తెలియజేసింది. మంచు బ్రదర్స్ తో పాటు లక్ష్మి కూడా వీరికి మోహన్ బాబు కూడా జతకలిసి మంచు చతుష్టయంతో సినిమా వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు.


Click it and Unblock the Notifications











