మనోజ్ విడాకులపై మంచు లక్ష్మీ స్పందన.. సెక్స్ రాకెట్ గురించి ఏమన్నారంటే..

By Rajababu

Recommended Video

Manchu Lakshmi Talks To Media On Tollywood Issue

ప్రఖ్యాత నటుడు మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మీ సినీ పరిశ్రమలోకి వచ్చినా.. ఆమె తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. విలక్షణమైన, విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా W/o రామ్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం జూలై 20న రిలీజైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా సెక్స్ రాకెట్, మంచు మనోజ్ విడాకులపై వస్తున్న రూమర్లపై స్పందించారు.

చికాగో సెక్స్ రాకెట్ గురించి

చికాగో సెక్స్ రాకెట్ గురించి

అమెరికాలోని చికాగో సెక్స్ రాకెట్ విషయం ఆందోళన కలిగించే విషయం. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరైన నిబంధనలు లేకపోవడం వల్లే ఇలాంటివి చోటుచేసుకొంటున్నాయి. దీంతో అమెరికాలో తెలుగు యాక్టర్లంటే అనుమానాలు వస్తున్నాయని మంచు లక్ష్మి అన్నారు.

అధికారులు నన్ను ఆపారు

అధికారులు నన్ను ఆపారు

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను అనుమానంగా చూశారు. నాకు రెండు రకాల వీసాలు ఉంటాయి. ఒకటి ఓ1, మరొకటి బిజినెస్ వీసా. నీకు రెండు రకాల వీసాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నేను చెప్పిన సమాధానం అర్థం కాకపోయే సరికి నన్ను పక్కకు పెట్టారు. వాళ్లకు అర్ధం కాకపోతే ప్రతీ ఒక్కరిని అనుమానిస్తారు అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

 దాసరి, రామానాయుడు లేకపోవడం వల్లే

దాసరి, రామానాయుడు లేకపోవడం వల్లే

స్వర్గీయ దాసరి నారాయణరావు, రామానాయుడు లేకపోవడం టాలీవుడ్‌లో చాలా దారుణమైన విషయాలు చోటు చేసుకొంటున్నాయి. వారు ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కాదు. ఏ సమస్య వచ్చినా ఆయన ముందు ఉండి పరిష్కరించే వాళ్లు అని ఆమె అన్నారు.

మంచు మనోజ్ విడాకులపై

మంచు మనోజ్ విడాకులపై

మంచు మనోజ్ విడాకులపై మంచు లక్ష్మీ స్పందించారు. ఆయన జీవితంలో ఏం జరిగిందనే విషయంపై నేను స్పందించడం సరికాదు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివి. వారి జీవితాల గురించి నేను బహిరంగంగా మాట్లాడటం సరికాదు అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

మంచు మనోజ్ ఆరోగ్యం బాగుంది

మంచు మనోజ్ ఆరోగ్యం బాగుంది

మంచి మనోజ్ చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఆయన జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవు. అతడి జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన ప్రాజెక్టుల గురించి తాను చూసుకొంటున్నాడు అని మంచు లక్ష్మీ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X