Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
స్ట్రెస్ మొత్తం పోయింది.. ఈ విషయం దాచుకోలేకపోయా.. రానా ప్రకటనపై మంచు లక్ష్మీ రియాక్షన్
టాలీవుడ్లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న చరిత్ర అందరికీ తెలిసిందే. మూవీ మొఘల్ డా. డి రామానాయుడు, సురేష్ బాబు, ఎస్పీ ప్రొడక్షన్స్, వెంకటేష్ వీరంతా కలిసి ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేశారు. తెలుగు చిత్ర సీమను శాసిస్తున్న వారిలో వీరూ ఒకరు. అలాంటి దగ్గుబాటి ఫ్యామిలీ వారసుడు రానా, అతని ప్రేమ, పెళ్లి విషయం గురించి ఏ రేంజ్లో ప్రకటన జరుగుతుందో అందరికీ ఓ అంచనా ఉంటుంది. అయితే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా రానా తన ప్రేమ విషయాన్ని ప్రకటించేశాడు.
రానా ప్రేయసి వివరాలు ఇవే..
రానా తన ప్రేయసి పేరు మిహికా బజాజ్ అని మాత్రమే తెలిపాడు. ఇక ఆమె ఎవరా? అని అంటూ గూగుల్ సర్చ్‌లో వెదుకులాట ప్రారంభించారు తెలుగు ప్రేక్షకులు. హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. కాకపోతే ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నారు. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే కంపెనీకి వ్యవస్థాపకురాలు. ముంబై, హైదరాబాద్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా సుపరిచితులు.
ఆ లిస్ట్‌లోంచి బయటకు..
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్ తీస్తే అందులో రానా దగ్గుబాటి పేరు కచ్చితంగా ఉంటుంది. రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌ను పరిచయం చేసి.. బ్యాచ్‌లర్ ట్యాగ్‌ను వదిలేశాడు. ఇప్పటికే నితిన్, నిఖిల్ వంటి యంగ్ హీరోల పెళ్లి ఫిక్స్ అయింది. లాక్ డౌన్ కారణంగా వీరి పెళ్లి వాయిదా పడింది. లాక్ డౌన్ ముగిసిన తరువాత వీరంతా పెళ్లి పీఠలెక్కబోతోన్నారు.
కదిలిన టాలీవుడ్..
రానాకు తన ప్రేయసి ఓకే చెప్పేసిందని ప్రకటించిన మరు క్షణం ఆ వార్త వైరల్ అయింది. ఇక రానాకు కంగ్రాట్స్ చెబుతూ సినీతారలంతా ట్వీట్స్ చేశారు. రామ్ చరణ్, మంచు మనోజ్, రాజమౌళి, హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, క్రిష్, శోభు యార్లగడ్డ,అనుష్క, చిరంజీవి ఇలా సెలెబ్రిటీలంతా స్పందించారు
Recommended Video
విషయాన్ని దాచుకోలేక..
రానా తన ప్రేయసి గురించి ప్రకటించడం మంచు లక్ష్మీ స్పందిస్తూ.. ‘ఈ ప్రపంచం ఓ విషయం తెలుసుకోవాలని నేనెంత గానో ఎదురుచూస్తున్నా.. ఆ ఆనంద గడియలు వచ్చేశాయ్.. మీ ఇద్దరి పట్ల ఎంతో ఆనందంగా ఉంది.. గత కొన్ని రోజులుగా ఈ విషయాన్ని దాచుకుంటూ ఉన్న ఒత్తిడి మొత్తం వెళ్లిపోయింద'ని చెప్పుకొచ్చింది.