మడత మంచంపై మంచు లక్ష్మీ.. అలా గడిపేస్తున్నానంటూ పోస్ట్
మంచు లక్ష్మీ చేసే పోస్ట్‌లు ఒక్కోసారి కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. ఒక్కోసారి ఆమె గాలిని ఆమె తీసుకున్నట్లు ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ.. నిత్యం ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఆమె మాట్లాడే మాటలు, క్రియేట్ చేసే కొత్త పదాల గురించి యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలున్నాయి. ఆమెపై జరిగే ట్రోలింగ్.. మరేతర సెలెబ్రిటీల మీద జరగేదేమోనన్న అనుమానం కలుగుతుంది. అయితే ఎంతమంది ఎన్నిరకాలుగా కామెంట్స్ చేసినా.. ఆమె మాత్రం తాను అనుకున్నపనినే చేస్తూ ఉంటుంది.
గత రెండు మూడు రోజులుగా మంచు లక్ష్మీ వార్తల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం ఆమె చేసిన ఓ ట్వీటే. మల్లెపూలు అంటూ ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఓ నెటిజన్‌ను పోబే అనడం, అతను తిరిగి పోవే అనడం అందరికీ తెలిసిందే.

తాజాగా మంచు లక్ష్మీ మరో పోస్ట్ చేసింది. లాక్ డౌన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తోందో తెలిపింది. సాయంత్రం ఇంటిపై మడత మంచం వేసుకుని చంద్రున్ని చూస్తూ చిన్ననాటి సంగతులను కూతురితో పంచుకుంటున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











