Just In
- 48 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- News
Paul Dhinakaran జీసస్ కాల్స్ సంస్థలపై ఐటీ దాడులు .. ఎన్నికలకు ముందే..!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బన్నీకి దెయ్యం పట్టింది(వీడియో)
హైదరాబాద్ : ఇంకో హర్రర్ చిత్రం మన ముందుకు రావటానికి సిద్దమవుతోంది. లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్, బేబీ డాలీ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బుడుగు'. మన్మోహన్ దర్శకత్వం వహించారు. భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మాతలు. సుధీర్ సమర్పిస్తున్నారు. బన్నీకు దెయ్యం పట్టిందంటూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఆ ట్రైలర్ ని మీరూ చూడండి.
నిర్మాత సారిక శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘కథ నచ్చి సినిమా చేశాం. ఛైల్డ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. లక్ష్మి కీలక పాత్ర పోషించారు. ఇంద్రజ గెస్ట్ అప్పియరెన్స్ చేశారు'' అని తెలిపారు. శ్రీధర్‌రావు మాట్లాడుతూ ‘‘సినిమా చేస్తున్నంత సేపు రియాలిటీగా జరిగినట్టు అనిపించింది. రీరికార్డింగ్, స్ర్కీన్‌ప్లే ప్లస్సవుతాయి'' అని అన్నారు. మంచి పాత్ర పోషించానని మాస్టర్ ప్రేమ్ తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ సైకియాట్రిస్ట్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయాల ఆధారంగా సినిమా తీశాం. ఇది వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. లక్ష్మీ మంచు పాత్ర చాలా కీలకమైంది. ప్రేమ్‌బాబు చాలా బాగా చేశాడు. సాయికార్తిక్ మంచి సంగీతాన్నిచ్చారు'' అని అన్నారు.
అలాగే...‘‘ఈ రోజుల్లో పిల్లలపై వివిధ కారణాలతో ఒత్తిడి పెరగడంతో, వారు అయోమయానికి గురికావాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఓ పిల్లాడికి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురైతే ఆ పిల్లాడు ఏం చేస్తాడు? అతని వల్ల తన కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. వాటి కారణాలను విశ్లేషిస్తూ ఉత్కంఠతో సాగే కథే ‘బుడుగు' అని దర్శకుడు చల్లా మన్మోహన్ తెలిపారు.
లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘‘బుడుగు వండర్‌ఫుల్ సినిమా. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. స్ర్కిప్ట్ వినగానే నచ్చింది. డాలీకి, ప్రేమ్‌కి, కుక్కపిల్లకు దర్శకుడు ఇచ్చిన ట్రైనింగ్ సూపర్బ్. లాస్ ఏంజిల్స్‌లో ఎలా షూటింగ్‌కి ప్రిపేర్ అవుతామో అలా ప్రిపేర్ అయ్యారు మన్‌మోహన్‌గారు. సురేష్ రఘుతుతో ఇది నా రెండో సినిమా. చిత్రాన్ని జనవరి మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
సన, ఇందు ఆనంద్, శైలజ వాణి, అల్తాఫ్, ఇంద్రజ ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సమర్పణ: సుధీర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, సంగీతం: సాయికార్తిక్, కెమెరా: సురేష్ రఘుతు, ఎడిటింగ్: శ్యామ్, ఆర్ట్: ఎ.రామ్, లిరిక్స్: బాలాజీ.