మంచు లక్ష్మి ప్రసన్న ని ఆపేయమన్నారు

ప్రముఖ నటుడు నాగార్జున బుల్లితెరపై మెరవనున్నారు. 28 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో ద్వారా డ్రాయింగ్ రూమ్‌లో వీక్షకులను పలకరించనున్నారు. జూన్ మొదటివారం నుంచి 'మా' టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఇప్పటికే విజయవంతమైన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఫార్ములాతోనే ఈ గేమ్ షో రూపొందుతోంది.
మాటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో పాల్గొనే అవకాశం అందరికీ కలిపిస్తున్నారు. హాట్ సీన్ చేరుకొని తమ అభిమాన హీరో నాగార్జునతో ఆడాలనుకున్నవారు మాటీవీలో ప్రసారమవుతున్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పంపి రిజిష్టర్ చేసుకోవచ్చు. ప్రసారమైన ఏడు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సమాధానం ఎస్‌ఎంఎస్ చేసినా హాట్ చేరుకొనే అవకాశం దక్కవచ్చు. అంతేకాదు జీవితాన్ని మార్చేసే కోటి రూపాయల బహుమతిని కూడా అందుకోవచ్చు.
మాటీవీ ఈ పోటీని అత్యంత విశ్వసనీయమైన పద్ధతుల్లో నిర్వహిస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో ఈ షో సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. బిగ్ సినర్జీ ఈ కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. కోటి రూపాయల బహుమానం అందించే ఈ షోలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది. కోటి రూపాయలు గెలుచుకోవాలన్న కలని ఎవరైనా నిజం చేసుకోవచ్చునే ఆలోచనతో ఆరంభమైంది 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షోని మాటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నాలెడ్జ్ షో అత్యంత ఆసక్తికరంగా సాగుతూ, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు విలక్షణమైన వినూత్నమైన వినోదాన్ని అందించబోతోంది. జీవితం సంధించే వంద ప్రశ్నలకు ఒకటే జవాబు- అదే, మీలో ఎవరు కోటీశ్వరుడు.


Click it and Unblock the Notifications











