త్వరలో...మంచు లక్ష్మిప్రసన్న గుండెల్లో గోదావరి ఉరకలు
'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో ఐరేంద్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన మంచు లక్ష్మీ ప్రసన్న త్వరలో మరో చిత్రం ద్వారా కనిపించనుంది. ఆమె ప్రధాన పాత్రలో 'గుండెల్లో గోదావరి' పేరుతొ ఓ చిత్రం రూపొందనుంది. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేసుకున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని లక్ష్మి ప్రసన్న స్వయంగా నిర్మిచనుంది కూడా. ఇక లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతంరామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దొంగల ముఠా చిత్రం కూడా కమిటైంది. ఇక తాను రామ్ గోపాల్ వర్మ 'దొంగల ముఠా'లో నటించటం గురించి చెబుతూ.... సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంది. నా కలల్లో మరోటి నిజం కాబోతోంది అంది.ఇక ఇటీవలే 'అనగనగా ఓ ధీరుడు'లో తొలిసారిగా నటించి, అందరి ప్రశంసలు అందుకుంటోన్న లక్ష్మీప్రసన్నకు ఇది రెండో చిత్రం. 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు' సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాని వర్మ ప్రారంభించనున్నారు.పిబ్రవరి 11కి షూటింగ్ మెదలుపెట్టి మార్చి 11కి ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. అలాగే మరో ఇద్దరు నిర్మాతలు కూడా ఆమెను తమ సినిమాల్లో నటించమంటూ కలిసారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











