మంచు లక్ష్మి ‘పిలవని పేరంటం’ (ఫోటోస్)
హైదరాబాద్: రొటీన్ సినిమాల్లో రోటీన్ పాత్రలు చేయకుండా...విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికే ప్రాముఖ్యత చూపుతున్న నటి మంచు లక్ష్మి త్వరలో ‘పిలవని పేరంటం' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రియదర్శిని మూవీస్ మరియు జైన్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రం నేడు(18.11.14) ప్రారంబోత్సవం జరుపుకుంది.
ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కమెడియన్ ధనరాజ్ ఇందులో మంచు లక్ష్మికి జోడీగా నటిస్తున్నాడు. తాజాగా ఈచిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ మంచు లక్ష్మి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. అందుకు సంబంధించిన పోటోపై మీరూ ఓలుక్కేయండి
‘పిలవని పేరంటం' చిత్రానికి వెంకన్న బాబు దర్శకుడు. గతంలో ఆయన ‘జగన్ నిర్దోషి' చిత్రానికి దర్శకత్వం వహించారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

హైలెట్
స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. కథ అంతా మంచు లక్ష్మి పాత్ర చుట్టూ తిరుగుతుంది.

థ్రిల్లింగ్ సీన్స్
థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. సన్నివేశాలు ఉత్కంఠతకు గురి చేస్తాయి. అని దర్శకుడు వెంకన్న బాబు తెలిపారు.

షూటింగ్ షురూ
షూటింగ్ ప్రారంభమైన ఈచిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగులోకి ఎంటర్ కాబోతోంది.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కురాకుల, సినిమాటోగ్రపీ: జియల్ బాబు, అడిషనల్ స్క్రీన్ ప్లే,కథా సహకారం: మధు విప్పర్తి, మాటలు: వెంకటేష్ కిలారు, ఎడిటింగ్ : ఉపేంద్ర, ఆర్ట్: కుమార్, రచన సహకారం: అరుణ్ కుమార్ నిమిషకవి, ఫ్యాషన్స్: సత్తిరాజు నరసింహారావు, శ్వేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: దేవర శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్ గోరి, నిర్మాత : నాలి సుబ్బారావు(సుబ్బు), కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెంకన్న బాబు యేపుగంటి.

పిలవని పేరంటం ఫస్ట్ లుక్ పోస్టర్
పిలవని పేరంటం ఫస్ట్ లుక్ పోస్టర్


Click it and Unblock the Notifications











