Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ గోపాల్ వర్మ షార్ట్ ఫిలిం...డిటేల్స్
హైదరాబాద్ : ఇప్పుడు షార్ట్ ఫిలిం ల సీజన్ టాలీవుడ్ లో నడుస్తోంది. సుకుమార్ వంటి దర్శకులు సైతం ఈ షార్ట్ ఫిలిం లు రూపొందించి వార్తల్లో నిలిచారు. దాంతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఓ షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేసారు. అయితే ఆ షార్ట్ ఫిలిం డిఫరెంట్ గా ఉండాలని భావించి,డిజైన్ చేసారు.
'ఓ వ్యక్తి జీవితంలో ఒక రోజు గురించి చెప్పడం వినుంటాం. చూసుంటాం. మరి ఓ వ్యక్తి పాదం ఒక రోజులో ఏం చేసిందని ఎవరైనా చూపించారా? ఇప్పుడు వర్మ ఆ ఆలోచన చేశారు. 'ఏ డే ఆఫ్ లక్ష్మీ మంచు ఫుట్' అనే పేరుతో ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. ఒక రోజులో మంచు లక్ష్మి పాదం ఏమేం పనులు చేసింది అనేది ఈ లఘుచిత్రంలో చూపించారు. వర్మ రూపొందించిన తొలి లఘుచిత్రమిది. త్వరలో దీన్ని ఆన్లైన్లో విడుదల చేస్తారు.
మరోవైపు మంచు విష్ణు కూడా ఓ లఘుచిత్రాన్ని తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ షార్ట్ ఫిలిం లో రామ్ గోపాల్ వర్మ జీవన విధానం చూపించాలని అనుకుంటున్నారు. ఈ రెండు షార్ట్ ఫిలిం లు కూడా మంచి ఆదరణ లభిస్తాయని భావిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేసే షార్ట్ ఫిలిం అనే అంశం, రామ్ గోపాల్ వర్మ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అనే అంశం రెండూ హాట్ ఎలిమెంట్సే ..ఇవే ఈ షార్ట్ ఫిలింలకు యు.ఎస్ పి.
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అనుక్షణం'. విష్ణు ప్రధాన పాత్రధారుడు. ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం క్లైమ్ థ్రిల్లర్ గా చెప్తున్నారు. ''విష్ణును రౌడీగా చూపించాను. ఇప్పుడు పోలీసుగా చూపిస్తున్నాను. ఈ రెండింటిలో ఏది బాగుంది అంటే నటన విషయంలో పోలీసు విష్ణు బాగున్నాడు. లుక్ పరంగా చూసుకుంటే రౌడీ విష్ణు ఇష్టం. 'అనుక్షణం'లో విష్ణు పాత్ర సర్ఫరోష్లో అమీర్‌ఖాన్‌కు దగ్గరగా ఉంటుంది. సీరియల్ కిల్లర్ల నేపథ్యంలో విదేశాల్లో ఏడాదిలో చాలా సినిమాలు, పుస్తకాలు వస్తుంటాయి. ఇక్కడ నేను అలాంటి ప్రయత్నం చేస్తున్నాను అన్నారు.