మంచు లక్ష్మి స్పెషల్ సాంగ్ కలుపుతున్నాం

అలాగే 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ప్రథమార్ధాన్ని హిందీ 'గోల్‌మాల్' నుంచి తీసుకున్నాం. దీనికై వారి నుంచి రైట్స్ కూడా తీసుకున్నాం. అయితే కథని తీసుకోలేదు. కేవలం పాత్రల స్వభావాల వరకే ఆ సినిమాని పోలి ఉంటుంది అన్నారు.
ఇక ఒకరోజు ఉదయం ఆరు గంటలకే నాన్నగారు ఫోన్ చేసి 'కంగ్రాచ్యులేషన్స్. నువ్వీ సినిమాలో ఉన్నావ్'వని ఫోన్ పెట్టేశారు. తరువాత మా వాళ్లకు ఫోన్ చేస్తే విషయం తెలిసింది. డైరెక్టర్ శ్రీవాస్ నాది లేడీ గెటప్ అని చెప్పారు. చాలా ఎగ్జయిట్‌గా ఫీలయ్యాను. మొత్తానికి మోహినిగా నటించాను. విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఈ గెటప్ బయటకు రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సెట్లో సెల్‌ఫోన్ వాడొద్దని బోర్డ్ కూడా పెట్టించారు నాన్న. ముందే తెలిస్తే మా కష్టమంతా వృథా అవుతుంది కదా అని చెప్పుకొచ్చారు.
తనకు నచ్చిన సీన్స్ గురించి చెప్తూ....మోహిని చనిపోయాక సుప్రీత్ వచ్చి ఏడ్చే సీన్ కోసం 18 టేక్‌లు తిన్నాను. సుప్రీత్‌తో నాకు చనువు ఎక్కువ. ఆయనలా ఏడుస్తుంటే విపరీతంగా నవ్వొచ్చేది. అందుకే టేక్‌ల మీద టేక్‌లు తినేశాను. 'బల్లి సీన్', మోహిని లెటర్ రాసే సీన్లు నా ఫేవరేట్. 'మోహిని' మేకప్ కోసం మూడు గంటలు పట్టేది. ఆ సమయంలో చాలాసార్లు అనుకున్నాను. ఇంట్లో ఆడవాళ్లు రెడీ అవుతుంటే ఎప్పుడూ విసుక్కోవద్దని. ఈ క్యారెక్టర్ కోసం ఒప్పుకున్నప్పుడు 'పోటుగాడు' షూటింగ్ నడుస్తోంది. కానీ అప్పట్నుంచే మోహిని పాత్ర కోసం బరువు పెరిగే ప్రయత్నం చేశాను. స్వీట్లు అవీ ఇవీ తినేవాణ్ణి అన్నారు.


Click it and Unblock the Notifications











