అందుకే విష్ణు, మనోజ్‌ను పిలవలేదు: మోహన్ బాబు గురించి మంచు లక్ష్మి ఎమోషనల్ స్పీచ్!

By Bojja Kumar

Recommended Video

Wife Of Ram Trailer Launch Event

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 కృతజ్ఞత భావంతో ప్రతీరోజూ నా జీవితాన్ని గడుపుతాను

కృతజ్ఞత భావంతో ప్రతీరోజూ నా జీవితాన్ని గడుపుతాను

నేను చాలా కృతజ్ఞత భావంతో ప్రతీరోజూ నా జీవితాన్ని గడుపుతాను. తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా నాకు పేరు వస్తుంది, చేయగలుగుతాను అనే ఒక ఒక డ్రీమ్ కూడా నాకు ఉండేది కాదు. ఈ రోజే కాదు కాదు ప్రతిసారి మా నాన్నతో స్టేజీ ఎక్కినపుడు, ఆయనతో కలిసి స్టేజీ మీద కూర్చున్నపుడు ఏదో ఒక తెలియని గర్వం ఉంటుంది. మా నాన్న పక్కన కూర్చునేంత పేరు నేను సంపాదించుకోగలిగాను అనే సంతోషం నాలో ఎప్పుడూ ఉంటుంది అని మంచు లక్ష్మి తెలిపారు.

పునాదులు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టే

పునాదులు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టే

ఒక ఆర్టిస్ట్ అంటే ఏమిటి? ఒక మనిషి అంటే ఏమిటి? మనం ఎందుకు పుట్టాం. ఎందుకు ఏదో ఒకటి సాధించాలి.... అని నాన్న చిన్నప్పటి నుండి చెప్పేవారు. మేము లేజీగా ఉండకుండా పెంచారు. ఆయన అలా పెంచారు కాబట్టే మా పునాదులు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి... అని మంచు లక్ష్మి తెలిపారు.

 అందుకే వారిని కూడా పిలవలేదు

అందుకే వారిని కూడా పిలవలేదు

ఈ వేడుకకు విష్ణు, మనోజ్‌ను కూడా పిలవలేదు. కేవలం మా నాన్నను రిప్రంజట్ చేయాలనే ఇలా చేశాను. నాకు ఇండస్ట్రీలో శిల్ప, రకుల్, స్వప్న ఇలా పది పదిహేను మంది స్నేహితులు ఉన్నారు. నేను ఏం అడిగినా కాదనరు. ఫోన్ చేసి ఇది కావాలి అంటే నో అని చెప్పకుండా చేస్తారు. ఇలాంటి స్నేహితులు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.... అని మంచు లక్ష్మి అన్నారు.

 నాలోని టాలెంట్ చూసి ఎంకరేజ్ చేశారు

నాలోని టాలెంట్ చూసి ఎంకరేజ్ చేశారు

నేను మనిషిగా నమ్మేది ఏమిటంటే... లోకంలో ఎంత మంది ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటే, ఎంత ఎక్కువ మంది క్రియేటివ్ పీపుల్ ఉంటే ప్రపంచం అంత ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. నేను అమెరికాలో నా కెరీర్ మొదలు పెట్టినపుడు మోహన్ బాబు కూతురు అంటే ఎవరో తెలియదు, మంచు ట్యాగ్ అంటే ఎమిటో తెలియదు. నాలోని టాలెంట్ చూసి ఎంకరేజ్ చేశారు. అది ఉండబట్టే ఈ పొజిషన్లో ఉన్నాను అని మంచు లక్ష్మి తెలిపారు.

 నిర్మాతల దర్శకుడు

నిర్మాతల దర్శకుడు

దర్శకుడు విజయ్ యెలకంటి చాలా ఇంటలిజెంట్ డైరెక్టర్. వర్కింగ్ స్టైల్ చాలా బావుంటుంది. సినిమాను ఎంత బడ్జెట్లో తీయాలో అంతే బడ్జెట్లో కంప్లీట్ చేశారు. ఏనాడూ ఇది పెంచండి అని అడగలేదు. బడ్జెట్‌కు తగిన విధంగా మార్పులు చేసుకుంటూ వెళ్లారు. అతడు నిర్మాతల దర్శకుడు అని మంచు లక్ష్మి పొగడ్తలు గుప్పించారు.

వైఫ్ ఆఫ్ రామ్

వైఫ్ ఆఫ్ రామ్

మంచు లక్ష్మి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘వైఫ్ ఆఫ్ రామ్'లో సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ,ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు పీ.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, మాటలు : సందీప్ గుంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X