twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో మాత్రం మంచు లక్ష్మీ డైలాగ్ కింగ్ కి సరితూగదు...

    By Sindhu
    |

    ఆ మధ్య 'జీటీవీ"లో 'లక్ష్మీ ప్రసన్న టాక్ షో" పేరుతో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహిరించిన మంచు లక్ష్మీ, ఇప్పుడీ షోని కొంచం అటు ఇటు మార్చి 'ఈటీవీ"కి షిఫ్ట్ చేసింది. 'ప్రేమతో మీ లక్ష్మీ" పేరిట ఆ టాక్ షో ప్రతి గురువారం రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారమవుతుంది తొలి ఎపిసోడ్ ఈ10న టెలికాస్ట్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో జరిపిన టాక్ షో ఆరోజు ఎయిర్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని ఈటీవీ భారీగా చేబట్టింది. ఈనాడు, ఈటీవీ..రెండు మాధ్యమాలలోనూ ప్రమోషన్ని దంచుతున్నారు.

    గతంలో జీటీవీలో నిర్వహించిన షో క్వాలిటీ పరంగా బాగానే ఉన్నప్పటికీ, లక్ష్మి తెలుగుని భరించడం మాత్రం కాస్త కష్టమే! తండ్రి మోహన్ బాబు తెలుగు భాషని ఎంత స్పష్టంగా, అందంగా పలుకుతాడో అందరికీ తెలుసు. అందుకే, డైలాగ్ కింగ్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే, నటన విషయంలో తండ్రి పోలికలు తెచ్చుకున్నా, భాష విషయంలో మాత్రం ఆయన పోలిక ఆమెకు ఏమాత్రం రాలేదు. ఈ విషయంలో లక్ష్మి కాస్త సాధన చేయాలి!

    English summary
    The ‘Lakshmi Talk Show’ returns in a fresh-new look as ‘Prematho Mee Lakshmi’, on this time on ETV. In the first season, the show had earned the highest TRP ratings ever for a Telugu program across all channels. Prematho Mee Lakshmi Show is going to starts from Feb 2nd week onwards every Thursday 09:30pm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X