twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయబ్రాంతులకు గురి చేస్తున్నారు: మోహన్ బాబు హౌస్ అరెస్టుపై మంచు లక్ష్మి

    |

    ప్రముఖ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు హౌస్ అరెస్టుపై మిశ్రమ స్పందన వస్తోంది. శాంతి యుతంగా ర్యాలీ తలపెట్టిన మోహన్ బాబును అరెస్ట్ చేయడం సరికాదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో మోహన్ బాబు చేపట్టిన ఈ ర్యాలీ వెనక పొలిటికల్ స్టంట్‌‌ ఉందని విమర్శిస్తున్నారు.

    కాగా.. తన తండ్రి హౌస్ అరెస్టుపై టాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి స్పందించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె ట్విట్టర్ ద్వారా రియాక్టర్ అయ్యారు.

    భయబ్రాంతులకు గురి చేస్తున్నారు

    భయబ్రాంతులకు గురి చేస్తున్నారు

    ప్రజాస్వామ్య బద్దంగా, శాంతి యుతంగా ఒక సమస్యపై నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో హౌస్ అరెస్ట్ లాంటి చర్యలు చేపట్టడం సరైంది కాదని, ఇలా చేయడం ద్వారా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు.

    మోహన్ బాబు ట్వీట్

    మోహన్ బాబు ట్వీట్

    ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించక పోవడంపై శాంతి యుతంగా ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ర్యాలీ చేపట్టాలని భావించిన తనను పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారని, బయకు రానివ్వడం లేదని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

    ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదు మెహన్ బాబుగారూ..?

    గత నాలుగున్నర సంవత్సరాలుగా మీరు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందనే ఇదంతా చేస్తున్నారంటూ... కొందరు మోహన్ బాబుపై విమర్శలు చేసే ప్రయత్నం చేశారు.

    రాజకీయాలు ఆపాదించవద్దు

    దీనికి రాజకీయాలు ఆపాదించ వద్దు. ఒక మంచి కారణంతో మోహన్ బాబు శాంతియుత ర్యాలీతో నిరసన తెలపాలనుకున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఇదంతా చేశారు. దీన్ని యాంటీ టీడీపీగా లేదా వైసీపీకి మద్దతుగా చేస్తున్నా ర్యాలీగా చూడొద్దు అంటూ కొందరు మోహన్ బాబుకు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు.

    English summary
    "Wanted to take a peaceful rally today in Tirupathi protesting the non payment of the fee reimbursement of the students by the Govt.... Police have arrived at our home in Tirupathi and looks like they are not going to allow the rally." Mohan Babu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X