నాయనమ్మ చనిపోయిన బాధ లేదా? మంచు లక్ష్మి చేసిన పనికి నెటిజన్ల ఆగ్రహం!
Recommended Video

ప్రముఖ నటుడు మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ మరణంతో మంచు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి సినిమా ప్రమోటింగ్ ట్వీట్స్ చేయడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. నాయనమ్మ చనిపోయిన బాధ నీలో లేదా, మీ ఇంట్లో అందరూ విషాదంలో ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఏమిటీ అంటూ కొందరు ఘాటైన కామెంట్స్ చేశారు. తమిళంలో జ్యోతిక నటిస్తున్న మూవీ 'కాట్రిన్ మోళి'తో మంచు లక్ష్మి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయమై ట్వీట్ చేయడం వల్ల ఈ చిక్కంతా వచ్చి పడింది.
మంచు లక్ష్మి చేసిన ట్వీట్ ఇదే
హిందీలో సూపర్ హిట్ అయిన ‘తుమ్హారీ సులు' చిత్రాన్ని తమిళంలో ‘కాట్రిన్ మోళి' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా తాను తమిళ సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నానని, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ వస్తోంది. చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది అంటూ లక్ష్మి ట్వీట్ చేశారు.

నెటిజన్ల విమర్శలు
మీ నాయనమ్మ చనిపోయి ఉంటే నువ్వు ఇలా సినిమాను ఎలా ప్రమోట్ చేయగలుగుతున్నావు? కొంచెం అయినా బాధ లేదా? ఇలాంటి ట్వీట్స్ చేసే సమయమేనా? నీ కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం... అంటూ కొందరు ఘాటుగా విమర్శలు చేశారు.
మంచు మనోజ్ ట్వీట్
నాయనమ్మ చనిపోయిన విషయం తెలుసుకుని విదేశాల్లో ఉన్న మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘మా నానమ్మ లక్ష్మమ్మగారు ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. నాయనమ్మ లేని లోటు తీర్చలేనిది. ఈ సమయంలో మేము ఇండియాలో లేక పోవడం మరింత బాధ పెట్టే విషయం. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆమె ఆత్మకుశాంతి చేకూరాలి అని వ్యాఖ్యానించారు.

మంచు లక్ష్మమ్మ
మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ(85) గురువారం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడించారు.


Click it and Unblock the Notifications











