అయ్యో ఇలా అయిందేంటి: మంచు లక్ష్మి ట్వీట్... రచ్చ రచ్చ!
మంచు లక్ష్మి ట్వీట్ ట్విట్టర్లో రచ్చ రచ్చ అయింది. కొందరు ఆమెకు కౌంటర్ ట్వీట్స్ చేశారు.
మంచు లక్ష్మి చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్లో రచ్చ రచ్చ అయింది. ఆమెను ఫాలో అవుతున్న కొందరు అభిమానులు, నెటిజన్లు ఆమె ట్వీట్ మీద భారీగా స్పందించారు. కొందరు ఆమెకు కౌంటర్ ఇస్తే, మరికొందరు సపోర్టు చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడటంతో రోడ్లు పాడైపోయి చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్స్ ఎదురువుతున్నాయి. హైటెక్స్ ప్రాంతంలో మంచు లక్ష్మి కారు కూడా ట్రాఫిక్‌లో గంటన్నర పాటు ఇరుక్కుంది. దీంతో చిర్రెత్తిన ఆమె ఓ ట్వీట్ చేశారు.

మంచు లక్ష్మి ట్వీట్
హైటెక్స్ ప్రాంతంలో గంటన్నర పాటు ట్రాఫిక్ లో ఇరుక్కు పోయాను. రాజకీయ నాయకులు ప్రోటోకాల్ లేకుండా మన లాగా ఇలాంటి ఈ దారిలో ప్రయాణించి ఇక్కడ పరిస్థితి ఏమిటో చూస్తే వారికి మన పెయిన్ ఏమిటో తెలుస్తుంది.... అంటూ ట్వీట్ చేశారు.

రస్నా రిప్లై
మంచు లక్ష్మి చేసిన ట్వీటుకు రస్నా అనే అమ్మాయి....స్పందిస్తూ ఆసక్తికర కామెంట్ చేసింది. మీలాంటి వారు వీఐపీ దర్శనాల పేరుతో తిరుమలకు వచ్చినపుడు మాకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నువ్వు కూడా మాలాగే వీఐపీ పాస్ లేకుండా సాధారణ క్యూ లైన్లలో నిల్చుని దర్శనం చేసుకుంటే మా పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది అంటూ ట్వీట్ చేసింది.

మంచు లక్ష్మి రిప్లై
రస్నా ట్వీటుకు మంచు లక్ష్మి రిప్లై ఇస్తూ.... నువ్వు కూడా విఐపీ దర్శనం చేసుకోవచ్చు. దానికి నువ్వు డబ్బులు పే చేస్తే సరిపోతుంది. అది రోడ్ల లాగా అందరికీ కామన్ కాదు. నీలాగా మాటలు వదిలేయడం సులభమే. బి వెల్.... అంటూ రిప్లై ఇచ్చింది.

కౌంటర్ ఇచ్చిన రస్నా
ఈ సారి మంచు లక్ష్మి ట్వీటుకు రస్నా దిమ్మదిరిగే రిప్లై ఇచ్చింది. వావ్ నేను కూడా విఐపీ కావొచ్చన్నమాట. అయితే విఐపీ అయిపోతా.... సాధారణ ప్రజలను క్యూలో మరింత వెయిట్ చేసేలా చేస్తా. విఐపీ అయితే ఇలాంటివి చాలా ఈజీ కదా. బి స్ట్రాంగ్.... అంటూ కౌంటర్ ఇచ్చింది.

మంచు అక్కా మీ కోసమే ఈ సందేశం అంటూ...
మంచు అక్ాక మీ కోసమే ఈ సందేశం అంటూ.... అందరూ సమానమే అనే అర్థం వచ్చేలా వివరించే ప్రయత్నం చేశాడు మరో వ్యక్తి.


Click it and Unblock the Notifications











