కన్నడ హీరోపై మనసుపడ్డ మంచులక్ష్మి
మోహన్ బాబు వారసురాలిగా చాలా లేటుగా పరిశ్రమలో అడుగు పెట్టిన మంచు లక్ష్మి ప్రసన్న ప్రీప్లాన్డ్‌గా హీరోయిన్ కావాలనే తన కల నెరవేర్చుకుంటోంది. తనకున్న గ్లామర్‌కి నేరుగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేం కాబట్టి 'అనగనగా ఓ ధీరుడు' చిత్రం ద్వారా విలన్ పాత్రలో రంగ ప్రవేశం చేసింది లక్ష్మి. ఆ తర్వాత దొంగల ముఠా చిత్రంలోనూ, ఇటీవల రామ్ గోపాల్ వర్మ 'డిపార్ట్ మెంట్' చిత్రంలోనూ చిన్న చిన్న పాత్రల్లో దర్శనం ఇచ్చింది.
అయితే ఆ చిత్రాలు పెద్దగా ఆడక పోవడం లక్ష్మిని కాస్త నిరాశ పరిచే విషయమే. దీంతో ఓ వైపు చిత్ర నిర్మాణ సంస్థను నడిపిస్తూనే... మరో వైపు నటనపై దృష్టి పెట్టిన లక్ష్మి హీరోయిన్‌గా నిలదొక్కునే పనిలో బిజీ బిజీగా గడుపుతోంది. తన మనసులోని మాటలను లక్ష్మి ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ....'ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఓ తమిళ సినిమాతో పాటు, సొంత బ్యానర్లో రెండు సినిమాలు చేస్తున్నాను. త్వరలోనే అవి రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి' అని చెప్పుకొచ్చింది.
అంతే కాదు.... 'తనకు తమిళ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం పెద్దగా ఆసక్తి లేదు కానీ.... కన్నడ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కు అంటే నాకు చాలా ఇష్టం. అతనితో నటించాలని కోరిక ఉంది' అని తన కోరికను బయట పెట్టింది.
మంచు లక్ష్మి ప్రస్తుతం తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న'గుండెల్లో గోదారి' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరో వైపు తమ్ముడు మనోజ్ హీరోగా బాలయ్య ముఖ్యమైన అతిథి పాత్రలో రూపొందుతున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈచిత్రంలోనూ మంచు లక్ష్మి ఓ పాత్రను పోషిస్తోంది.


Click it and Unblock the Notifications











