BB3FirstRoar.. తెగ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కేవలం బాలయ్య అభిమానుల్లోనే కాదు సగటు సినీ ప్రేక్షకుల్లోనూ తారాస్థాయి అంచనాలుంటాయి. అయితే సినీ ఇండస్ట్రీలోనూ ఈ కాంబోకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. దానికి మచ్చుకు ఓ ఉదాహరణ. మంచు లక్ష్మీ BB3FirstRoarను చూసి తెగ సంబర పడిపోతోంది.
వీరిద్దరు కలిసి గర్జించిన సింహ, లెజెండ్ సినిమాలు.. బాక్సాఫీస్‌పై దాడి చేసి రికార్డులను కొల్లగొట్టింది. ఇద్దరు కలిసి రికార్డులు తిరగరాశారు. ఇక ముచ్చటగా మూడోసారి అలరించేందుకు సిద్దమయ్యారు. బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి గర్జన ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. బాలయ్య లుక్స్, డైలాగ్ అదిరిపోయింది. బాలయ్య-బోయపాటి కాంబో అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనని సెలెబ్రిటీలు సైతం ఈలలు విజిల్స్ వేస్తున్నారు.

ఈ మొదటి గర్జన ఏ రేంజ్‌లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 24 గంటలు తిరగకుండానే 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ టీజర్‌ను మంచు లక్ష్మీ ఎంతో శ్రద్దగా వీక్షించింది. బాలయ్య లుక్, డైలాగ్స్‌కు ఎగిరి గంతేసినంత పని చేసింది. చూస్తున్నంత సేపు చప్పట్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసింది. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











