సహజంగా, ఆసక్తికరంగా మంచు లక్ష్మి!
మంచు లక్ష్మి ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది. ''వైఫ్ ఆఫ్ రామ్'' టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి రాజమౌళి వద్ద 'ఈగ', 'బాహుబలి-1' చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన విజయ్ యలకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
తాజాగా విడుదలైన ''వైఫ్ ఆఫ్ రామ్'' టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మంచు లక్ష్మి పాత్ర ఈ సినిమాలో చాలా సహజంగా, ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. పూర్తి వైవిధ్యంగా మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. వైఫ్‌గా మంచు లక్షి నటిస్తుండగా.. ఆమె భర్త రామ్ ఎవరన్నది సస్పెన్స్‌గా ఉంది. రేపు (బుధవారం) ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











