మల్లెపూలతో మంచు లక్ష్మీ.. ఎంజాయ్ చేస్తున్నానంటూ ట్వీట్
మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె భాష, యాస, మాట్లాడే విధానం తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇట్టే గుర్తుపడతారు. ఆమె మీడియాతో మాట్లాడినా, ట్వీట్స్ పెట్టినా ఏదో ఒక కొత్త పదాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. ఆమె క్రియేట్ చేసే పదాలు ఏ భాషకు చెందినవో స్పష్టంగా చెప్పలేకపోయినా.. అవి మాత్రం బాగానే వైరల్ అవుతుంటాయి. అలా మంచు లక్ష్మీ నోటి నుంచి జాలువారిన పదాలెన్నో ఉన్నాయి.
ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. నిలదీస్‌పై అంటూ పుసుక్కన నోరు జారేసింది. అయితే దాని మీనింగ్‌ను ఏ నిఘంటువులో వెతికినా దొరకదు. కరోనాను కూడా మన జనాలు తప్పుగా పలుకుతున్నారట. అసలు ఎలా పలకాలో మంచు లక్ష్మీ వివరించింది. కరోనాలోని ఆర్ అనేది కింద పడి అలా దొర్లాలి అంటా. ఇక ఈ వీడియో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా మల్లెపువ్వును కూడా కూనీ చేసేసింది. ఎన్ని రకాలుగా పలకాలో అన్ని రకాలుగా ప్రయోగాలు చేసింది. మల్లి, మాలి, మాలె, మాలెపువ్వు అంటూ ఈ ఫోటోను తెగ ఎంజాయ్ చేస్తున్నానంటూ ట్విట్టర్ జనాలకు తెలిపింది. స్కూల్ కాలేజ్ నుంచి ఇలా చేయడానికి కష్టపడ్డాడని తెలిపింది. టింగ్లీష్, ఇంగ్లీష్ స్పెల్లింగో కాదు ఇది నా డిటర్మినేషన్ మాత్రమే.. వూరికే అంటూ చేతిలో మల్లెపూలు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











